ఆదివారం, 19 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 19 జనవరి 2025 (17:50 IST)

Maha Kumba Mela: మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. ఎలా జరిగిందంటే?

Maha Kumbh
Maha Kumbh
మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‍‌రాజ్‌లోని భక్తుల గూడారాల్లో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో సెక్టార్ 5లో మంటలు చెలరేగాయి. వారణాసిలోని వివేకానంద సేవా సమితి టెంట్‌లో భోజనం వండుతుండగా మంటలు చెలరేగినట్లు సమాచారం. సెక్టార్ 5లో చెలరేగిన మంటలు క్రమంగా సెక్టార్ 19, 20కి కూడా వ్యాపించాయి. 
 
బలమైన గాలి కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. సమీపంలోని టెంట్‌లను కూడా చుట్టుముట్టడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ఇంకా సమాచారం అందలేదు. 
 
ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని, భక్తులు ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికార యంత్రాంగం ప్రకటించింది. గుడారాలు ఒక వరుసలో ఏర్పాటు చేయడంతో ఓ గూడారంలో సిలిండర్ పేలడం ఈ ప్రమాదానికి కారణమైంది.