గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: బుధవారం, 2 మార్చి 2022 (18:45 IST)

భార్యతో ఏకాంతంగా వున్న దృశ్యాలను చిత్రీకరించి డబ్బు కోసం బ్లాక్ మెయిల్

కాబోయే అల్లుడు చదువుకున్నాడు. మనకు బంధువు కూడా. మంచి ఉద్యోగం వస్తుందిలే. మన అమ్మాయిని బాగా చూసుకుంటాడని నమ్మారు ఆ తల్లిదండ్రులు. అర్థకిలో బంగారం, 15 లక్షల కట్నం ముట్టచెప్పి ఘనంగా పెళ్ళి చేశారు. పెళ్ళి జరిగిన నెల రోజులకే అల్లుడి బాగోతం బయట పడింది. తమ కుమార్తెను హింసించడమే కాదు.. తమను మానసికంగా హింసించడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు.

 
బెంగళూరు పరిధిలోని హనుమంతనగర ప్రాంతానికి చెందిన ప్రగత్ పురుషోత్తం, లక్కసంద్రంకు చెందిన 25 యేళ్ళ యువతికి నెలరోజుల క్రితం వివాహమైంది. పురుషోత్తం వివాహం చేసుకున్న యువతి వారికి బంధువే. పురుషోత్తంపై ఎంతో నమ్మకంతో కుమార్తెను ఇచ్చారు తల్లిదండ్రులు.

 
బిటెక్ పూర్తి చేసిన పురుషోత్తంకు ఏ చెడు అలవాట్లు లేవు. మంచి వ్యక్తిగా మార్కులు సంపాదించాడు. దీంతో ఉద్యోగం లేకపోయినా కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. అయితే వివాహమైన 10 రోజులకే తనలోని బుద్ధిని బయటపెట్టాడు పురుషోత్తం.

 
మొదటిరోజు రాత్రే తన భార్యతో గడిపిన క్షణాలు, ఆమె ఒంటరిగా బట్టలు మార్చుకోవడాన్ని తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. తన అత్తమామలు ఆస్తిపరులు కావడంతో డబ్బుల కోసం ఈ వీడియోలతో కట్టుకున్న భార్యనే బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.

 
తన భార్యకు ఆ వీడియోలను చూపించి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి డబ్బులు తీసుకురమ్మని వేధించేవాడు. లేకుంటే వీడియోలను నెట్లో పెట్టేస్తానంటూ బెదిరించేవాడు. తల్లిదండ్రులకు మొదట్లో అసలు విషయాన్ని చెప్పని ఆ వివాహిత డబ్బులు తీసుకుని అతడికి ఇస్తూ ఉండేది.

 
దీన్నే ఆసరాగా చేసుకున్న పురుషోత్తం మరింత రెచ్చిపోయాడు. ఇంకా డబ్బు కావాలంటూ ఆమెను చిత్రహింసలకు గురిచేసాడు. దీంతో తల్లిదండ్రులకు అసలు విషయాన్ని చెప్పేసింది. ముగ్గురూ కలిసి పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.