పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం
మహారాష్ట్రలోని పూణె నగరంలో దారుణం జరిగింది. డెలివరీ బాయ్ ముసుగులో వచ్చిన ఓ కామాంధుడు.. ఇంట్లోకి చొరబడి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బ్యాంకు లెటర్ వచ్చిందంటూ నమ్మించి ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. ఆ యువతిపై స్ప్రే చల్లి స్పృహతప్పి పడిపోయిన తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పైగా, ఆమె ఫోనులోనే సెల్ఫీ తీసుకుని, మళ్లీ వస్తానంటూ బెదిరింపు సందేశం పంపించాడు. ఈ పైశాచిక ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. కొంధ్వా ప్రాంతంలోని ఓ ప్రముఖ నివాస సముదాయంలో బుధవారం సాయంత్రం 7.30 గంటలమ సమయంలో నిందితుడు కొరియర్ బాయ్ రూపంలో వచ్చాడు. బ్యాంకు నుంచి ఒక లెటర్ వచ్చిందని దానిపై సంతకం చేయాలని నమ్మబలికాడు.
అయితే, తన వద్ద పెన్ను లేదని బాధితురాలు చెప్పడంతో నిందితుడు కూడా తన వద్ద లేదని బదులిచ్చాడు. ఆమె పెన్ను కోసం పడక గదిలోకి వెళ్లగానే అతడు తలుపునకు లోపలి నుంచి గడియ పెట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. బాధితారులు తేరుకునేలోపు ఆమెపై రకమైన స్ప్రే చెల్లాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోవడంతో ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథకమిక విచారణలో తేలింది.
కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన యువతి తన ఫోన్ చూడగా షాక్‌కు గురైంది. అందులో నిందితుడు సెల్ఫీతో పాటు మళ్లీ వస్తా అనే బెదిరింపు సందేశం ఉండటంతో భయాందోళనకుగురై తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు సమాచారం చేరవేసింది.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడుని పట్టుకునేందుకు ఏకంగా 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది. బీఎన్ఎస్ సెక్షన్లు 64, 77 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితుడుని గుర్తించేందుకు సొసైటీతో పాటు... వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.