శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2024 (19:37 IST)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

Woman
Woman
పూణేలో బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ గురువారం ఒక వ్యక్తి తనను అనుచితంగా తాకాడని ఆరోపిస్తూ కనీసం 25 సార్లు చెంపదెబ్బ కొట్టింది. ఆ మహిళ అతనిని పదే పదే హెచ్చరించినప్పటికీ, నేరస్థుడు ఆమెను వేధిస్తూనే ఉన్నాడు. అయితే, ఆ మహిళ జంకకుండా.. పక్కకు పోకుండా నిర్భయంగా తన తరపున నిలబడి, వేధించిన వ్యక్తి కాలర్ పట్టుకుని చెంపదెబ్బ కొట్టడం ప్రారంభించింది. 
 
బాధితురాలు, షిర్డీకి చెందిన పీటీ టీచర్ ప్రియా లష్కరే అని తేలింది. తన భర్త, బిడ్డతో బస్సులో ప్రయాణిస్తుండగా. ప్రయాణంలో, బాగా తాగిన మత్తులో ఉన్న వ్యక్తి ఆమెను వేధించడం ప్రారంభించాడు. అలాంటి ప్రవర్తనను సహించేది లేదనుకుని నిశ్చయించుకున్న ప్రియా.. వేధించిన వ్యక్తికి చుక్కలు చూపించింది. కోపాన్ని నియంత్రించుకోలేకపోయింది. ఏకంగా 25 సార్లు చెంపచెల్లుమనిపించింది.

తర్వాత శనివర్వాడ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు అతడిని లాక్కెళ్లింది. ఈ సంఘటనపై ప్రియా మాట్లాడుతూ..  వేధింపులు, హింసను భరించాల్సిన అవసరం మహిళలకు లేదని.. మహిళలు కలిసి నిలబడినప్పుడే అలాంటి నేరాలను ఆపగలం" అని ఆమె వెల్లడించింది.