మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

ట్యూషన్‌కు వెళ్లిన బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి

rape girl
దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణం జరిగింది. తన ఇంటికి ట్యూషన్‌కు వచ్చిన బాలికపై టీచర్ లైంగిక దాడికి తెగబడ్డాడు. తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలో ఈ దారుణం వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన 38 యేళ్ళ వ్యక్తి ప్రైవేటుగా ట్యూషన్ చెబుతున్నాడు. ఈయన వద్దకు స్థానికంగా ఉండే అనేక మంది పిల్లలు ట్యూషన్ కోసం వెళ్ళేవారు. 15 రోజుల క్రితం ఓ బాలిక ట్యూషన్‌కు వెళ్ళింది. ఆ రోజు శనివారం కావడంతో ఇతర విద్యార్థులు ఎవరూ ట్యూషన్‌కు రాలేదు. కానీ, ఈ బాలిక మాత్రం ఎప్పటిలానే ట్యూషన్‌కు వెళ్లింది. ఆ బాలిక ఒంటరిగా ఉండటాన్ని చూసిన టీచర్‌ తనలోని మరో కోణాన్ని బహిర్గతం చేశాడు.
 
అయితే, బాలిక ఒంటరిగా ఉండటంతో తన ఇంట్లోకి తీసుకెళ్లిన లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఆ బాలిక తన పట్ల టీచర్ ప్రవర్తించిన తీరును తల్లికి వివరించింది. విషయం తెలుసుకున్న టీచర్ షాక్‌కు గురైంది. అదే రోజు సాయంత్రం సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు కామాంధ టీచర్‌ను అరెస్టు చేశారు.