శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (08:40 IST)

భార్యపై కోపంతో ఇద్దరు కుమార్తెలకు విషమిచ్చిన తండ్రి

poison
భార్యపై కోపంతో తన ఇద్దరు కుమార్తెలకు ఓ కన్నతండ్రి విషమిచ్చాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా పాలకుర్తి మండలం, గూడురు శివారు ప్రాంతమైన జనకీపురం గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ధనలక్ష్మి, శ్రీను అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిద్దరికి పెళ్లి నాటి నుంచి తరచుగా గొడవలు జరుగుతుండేవి. 
 
ఈ నేపథ్యంలో భార్యమీద కోపంతో ఇద్దరు కుమార్తెలకు శీతలపానీయంలో విషం కలిపి తండ్రి శ్రీను ఇచ్చాడు. దీంతో వారు అపస్మారకస్థితిలోకి జారుకుంది. ఈ క్రమంలో పెద్ద కుమార్తె ప్రాణాలు కోల్పోగా, రెండో కుమార్తె ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఈమెను జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శ్రీనును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.