1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఏప్రియల్ 2025 (20:10 IST)

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

murder
హైదరాబాద్ నగరంలో ఓ దారుణం జరిగింది. ఏమాత్రం కనికరం లేని కన్నతల్లి తన ఇద్దరు పిల్లలను నరికి చంపేసింది. నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్‍‌ పరిధిలోని గాజులరామారంలో ఈ దారుణం జరిగింది. వేట కొడవలితో పిల్లలను నరికి చంపింది. ఆ తర్వాత ఆమె భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. చంపేసిన పిల్లల వయసు 7, 5 యేళ్ళుగా ఉంటాయని స్థానికులు తెలిపారు.
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో కన్నతల్లి ఈ ఘాతుకానికి పాల్పడివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 
 
కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి 
 
హైదరాబాద్ నగరంలోని ఫతేనగర్ ఏరియాలోని హోమ్ వ్యాలీలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి క్రూర మృగంలా ప్రవర్తించాడు. మూగ జీవాల పట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తించి, ఆ కుక్క పిల్లలను పట్టుకుని నేలకేసి కొట్టి రాక్షసానందం పొందాడు. అతని క్రూర చర్యలు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో బయటకు రావడంతో ఆ కిరాతకుడుపై నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
ఫతేనగర్‌లోని హోమ్ వ్యాలీ అపార్టుమెంట్‌ సెల్లార్‌లో తన పెంపుడు కుక్క దగ్గరకు వీధి కుక్క వచ్చిందని దాని ఐదు పిల్లలను ఆ కిరాతకుడు చంపేశాడు. ఆ అపార్టుమెంట్‌లో ఉంటున్న వ్యాపారి అశిష్ ఈ దారుణానికి పాల్పడినట్టు సీసీటీవీ దృశ్యాల ద్వారా తేలింది. దీంతో అతనిపై అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో జంతు ప్రేమికులు, నెటిజన్లు సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాల పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించడం ఏమిటని ఇలాంటి వారిని కఠింగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.