సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 మే 2023 (16:48 IST)

తెనాలిలో మైనర్ బాలికపై అత్యాచారం...

victim
ఏపీలోని తెనాలిలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కామాంధుడిని కొప్పుల రాజుగా గుర్తించారు. ఆ బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో, ఇంట్లో ఎవరూ లేరన్న విషయం తెలుసుకుని ఆమెకు మాయ మాటలు చెప్పి.. ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. 
 
ఆ తర్వాత బాలిక ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి చ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి వయసు 40 యేళ్లు.