ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2024 (06:25 IST)

భార్యను 224 ముక్కలుగా నరికిన కసాయి భర్తకు నేడు శిక్ష ఖరారు!!

murder
భార్యను 224 ముక్కలుగా నరికి శరీర భాగాలను నదిలో పడేసిన కసాయి భర్తకు కోర్టు నేడు శిక్షను ఖరారు చేయనుంది. ఈ దారుణం ఇంగ్లండ్‌లో గత మార్చి నెల 25వ తేదీన జరిగింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, గత యేడాది మార్చి నెల 25వ తేదీన 26 యేళ్ల బాధితురాలు హోలీ బ్రామ్లీ శరీర భాగాలు లింక్లన్‌షైర్‌లోని బాసింగ్ హాం వద్ద విథమ్ నదిలో గుర్తించారు. అప్పటికి ఆమె అదృశ్యమై ఎనిమిది రోజులైంది. దీనిపై కేసు నమోదు చేసిన ఇంగ్లండ్ పోలీసులు నిందితుడు నికోలస్ మెట్సన్ (28)ను అదుపులోకి తీసుకున్నారు. 
 
తొలుత నేరాన్ని అంగీకరించని నికోలస్ ఆ తర్వాత జరిగిన విచారణలో నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు గతంలో తన మాజీ భార్యలపై అనేక దారుణాలకు తెగబడిన కేసుల్లో 2013, 2016, 2017 సంవత్సరాల్లో దోషిగా తేలాడు. తాజాగా కేసు విషయానికి వస్తే బ్రామ్లీని 2021లో వివాహం చేసుకున్నాడు. వారి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా వారు విడిపోయే దశలో ఉండగా లింకన్‌లోని తన అపార్టుమెంట్‌లో ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో దోషిగా తేలిన మెట్సన్‌కు ఏప్రిల్ 8వ తేదీ సోమవారం శిక్షను ఖరారు చేయనుంది.