ఏపీ ప్రజలకు శుభవార్త... ఈ నెల 18 నుంచి 21 వరకు వర్షాలు
నైరుతి రుతుపవనాలు ఏపీని పలకరించనున్నాయి. ఇప్పటికే రుతుపవనాలు ప్రవేశించినా రాష్ట్రంలో ఎండల తీవ్రత మాత్రం తగ్గలేదు. ఇందుకు రుతుపవనాలు విస్తరించకపోవడమే కారణమని వాతావరణ శాఖ వెల్లడించింది.
అయితే తాజాగా ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. తాజాగా ఈ నెల 18 నుంచి 21 వరకు రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరిస్తాయని, దీంతో వర్షాలు కురుస్తాయని వివరించింది.
ఈ నెల 19 నుంచి తిరుపతి, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంద్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.