సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 జనవరి 2021 (14:08 IST)

సీఎం జగన్‌పై అచ్చెన్న ఫైర్.. గోవును అడ్డం పెట్టుకుని రాజకీయాలా?

Achenaidu
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. గోవును అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం తగదని, దిగజారుడు రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్యని అచ్చెన్న అన్నారు. 
 
మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, టిడిపి శాసనసభ పక్ష ఉపనేత, కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. బాబాయి హత్యపై జాలి చూపని వ్యక్తి దేవుళ్లపై విశ్వాసం చూపుతాడనేది భ్రమ అన్నారు. 
 
ఏ మతాన్నీ ప్రశాంతంగా ఉండనిచ్చే వ్యక్తిత్వం జగన్‌కు లేదని... అందుకే క్రిష్టియన్లకు క్రిస్మస్, ముస్లింలకు రంజాన్, హిందువులకు సంక్రాంతి కానుకలు దూరం చేశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
 
గోవును కోటి దేవతలకు ప్రతిరూపంగా ప్రజలు భావిస్తారని, గోవును అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయడం దుర్మార్గానికి నిదర్శనమని, సరైన పోషణ లేక ఎన్నో గోవులు మృత్యువాత పడ్డాయని, దానిపై స్పందించని ముఖ్యమంత్రి నేడు గుడికో గోమాత అంటూ విలక్షణ నటనకు తెరతీశారన్నారు.
 
ఇడుపులపాయలో క్రూర మృగాలను పెంచుతూ గుడికో గోమాత కార్యక్రమం చేపట్టడం విడ్డూరం. ఈ కార్యక్రమంలో పాల్గొనే అర్హత ముఖ్యమంత్రికి లేదని అచ్చెన్న ముఖ్యమంత్రిపై మండిపడ్డారు.