ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By
Last Updated : శనివారం, 10 నవంబరు 2018 (15:07 IST)

పండుగ సీజన్స్ వచ్చేసాయి.. మరి ఏం చేయాలి..?

ఇప్పుడు వచ్చే సీజన్.. అన్నీ పండగ సీజన్లే. పండుగలు వచ్చాయాంటే చాలు అందంగా, ప్రత్యేకంగా తయారవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకు సిద్ధం కావాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు.. 
 
ముందుగా ముఖాన్ని ఆల్కహాల్ లేని క్లెన్సర్‌తో తుడుచుకోవాలి. దాంతో పాటు రోజ్ వాటర్ కలిపిన నీటిలో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మరంధ్రాలు తెరుచుకుంటాయి. దాంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. జిడ్డు చర్మం గలవారు నూనెలేని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ముఖ్యంగా క్రీమ్స్ వాడడం అంత మంచిది కాదు. దానికి బదులుగా శెనగపిండితో, పసుపుతో ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది. 
 
తరువాత పేదాలు, చలికాలంలో పెదాలు పొడిబారుతుంటాయి. అందువలన లిప్‌స్టిక్ వేసుకోవడానికి ముందు పెదాలకు ఆలివ్ నూనె మర్దన చేసుకోవాలి. అప్పుడే పెదాలు అందంగా కనిపిస్తాయి. కళ్ల కింద నల్లటి వలయాలు ఉన్నవారు.. నారింజ తొక్కల పొడి కొద్దిగా కొబ్బరి నూనె కలిపి కంటి కింద రాసుకోవాలి లేదా బాదం నూనెతో మర్దన చేసుకోవాలి. ఇలా చేస్తే.. నల్లటి వలయాలు పోతాయి. 
 
మెడభాగం నల్లగా ఉన్నప్పుడు మీగడలో కొద్దిగా పెరుగు, చక్కెర కలిపి మెడకు రాసుకోవాలి. గంట పాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు స్నానానికి ముందు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.