సోమవారం, 28 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (20:37 IST)

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

Vanguard 2025
హైదరాబాద్: వోక్సెన్ విశ్వవిద్యాలయంలో ఔత్సాహిక డిజైనర్ల సృజనాత్మక ప్రతిభను వేడుక జరుపుకోవడానికి విద్యార్థులు, పరిశ్రమ నాయకులు, డిజైన్ ఔత్సాహికులను ఒకచోట చేర్చి డిజైన్ వాన్‌గార్డ్ 2025 నిర్వహించింది. మాదాపూర్ లోని టీ- వర్క్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో "టుమారో బై డిజైన్: నర్చరింగ్ ఫ్యూచర్ క్రియేటర్స్" అనే నేపథ్యంపై దృష్టి సారించి, ఇది ఆవిష్కరణ, పర్యావరణ పరిరక్షణ, అంతర్-విభాగ రూపకల్పన ఆలోచనలను నొక్కి చెప్పింది.
 
ఈ కార్యక్రమంలో ధరించగలిగేటటువంటి ఆవిష్కరణ, లీనమయ్యే వాస్తవికతలు, పర్యావరణ అనుకూల వాతావరణాలు, భవిష్యత్ చలనశీలత, గేమిఫైడ్ లెర్నింగ్‌తో సహా వివిధ డిజైన్ విభాగాల నుండి విస్తృత శ్రేణి విద్యార్థి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఐదు క్యూరేటెడ్ థీమ్‌లలో ప్రదర్శించబడ్డాయి.  ఈ ప్రదర్శన హాజరైన వారికి డిజైన్ యొక్క భవిష్యత్తును రూపొందించే కొత్త ఆలోచనలను ప్రత్యక్షంగా చూపించింది.
 
ఈ కార్యక్రమంలో మింత్రా డిజైన్ హెడ్ శ్రీ షయక్ సేన్; హైదరాబాద్‌లోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) హెడ్ శ్రీ పి. వెంకట్ శ్రీకాంత్; భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖలోని అడ్వాన్స్‌డ్ ల్యాబ్-డిఆర్ డిఓ డైరెక్టర్ డాక్టర్ కె. వీర బ్రహ్మం సహా విశిష్ట అతిథులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా వోక్సెన్ ఫ్యాషన్ షో నిలిచింది, ఇక్కడ వోక్సెన్ ఫ్యాషన్ కలెక్టివ్ అత్యాధునిక ఫ్యాషన్ డిజైన్‌లను ప్రదర్శించింది. 
 
వోక్సెన్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్&డిజైన్ డీన్ డాక్టర్ అదితి సక్సేనా మాట్లాడుతూ,"డిజైన్ వాన్‌గార్డ్ 2025 మా 'టుమారో బై డిజైన్' అనే నేపథ్యంను కలిగి ఉంది. ఈ వేదిక మా విద్యార్థుల అసాధారణ ప్రతిభను వెల్లడించాడమే కాకుండా, ఇంటర్ డిసిప్లినరీ డిజైన్ ఆలోచన ద్వారా మెరుగైన, మరింత స్థిరమైన భవిష్యత్తును రూపొందించడానికి వారికి శక్తినిస్తుంది" అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ డిజైన్, ఉత్పత్తి డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్‌తో సహా పలు విభాగాలలోని విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించారు.