Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు హెల్దీ స్నాక్స్.. చపాతీ ఆమ్లెట్ చేయడం ఎలా?

ముందుగా స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేడకయ్యాక ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగుల్ని చేర్చి దోరగా వేపాలి. మరో బౌల్‌లో వేయించిన ఉల్లి మిశ్రమానికి, శెనగపిండి, పసుపు పొడి, ఉప్పు, కొత్తిమీర కాస

Written By Selvi
Updated: మంగళవారం, 1 నవంబరు 2016 (16:26 IST)
పిల్లలకు ఇష్టపడి తినే స్నాక్స్ చేసి పంపుతున్నారా? షాపుల్లో అమ్మే ఆహార పదార్థాలతో స్నాక్స్ బాక్స్ నింపేస్తున్నారా? అయితే ఇక అలా చేయకండి. ప్రతిరోజూ వారికి హెల్దీ స్నాక్స్ ఇచ్చిపంపండి. అందుకే వెరైటీగా ఆమ్లెట్ చపాతీ ఎలా చేయాలో తెలుసుకోండి. గోధుమల్లోని ఫైబర్, కోడిగుడ్డులోని పుష్కలమైన పోషకాలు ఆరోగ్యానికి బలాన్నిస్తాయి.
 
ఎలా చేయాలంటే?
కావలసిన పదార్థాలు: 
చపాతీలు - రెండు 
కోడిగుడ్లు - మూడు 
శెనగపిండి - నాలుగు టేబుల్ స్పూన్లు
ఆనియన్ తరుగు - అర కప్పు 
పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్ 
పసుపు పొడి- ఒక స్పూన్  
కొత్తిమీర, కరివేపాకు తరుగు - రెండు స్పూన్లు 
ఉప్పు - తగినంత 
జీలకర్ర - అర స్పూన్
నూనె - తగినంత 
 
తయారీ విధానం : 
ముందుగా స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేడకయ్యాక ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగుల్ని చేర్చి దోరగా వేపాలి. మరో బౌల్‌లో వేయించిన ఉల్లి మిశ్రమానికి, శెనగపిండి, పసుపు పొడి, ఉప్పు, కొత్తిమీర కాసింత చేర్చి.. అందులోనే కోడిగుడ్లను పగుల కొట్టి బాగా గిలకొట్టుకోవాలి. ఆపై దోసె పెనం వేడయ్యాక చపాతీని వేడి చేసి.. గిలకొట్టిన కోడిగుడ్డు మిశ్రమాన్ని చపాతీపై పోసి.. నోరు పోసి ఆమ్లెట్‌లా వేగాక తిరగేసుకోవాలి. అంతే చపాతీ ఆమ్లెట్ రెడీ. ఈ చపాతీ ఆమ్లెట్‌కు గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

అన్నీ చూడండి

అత్యాచారాన్ని ప్రతిఘటించిన నర్సు ... చంపేసిన కామాంధుడు

మత్తు రహిత సమాజం కోసం యువత ప్రతినబూనాలి : ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు

గదిలో ఏకాంతంగా ప్రియుడితో దొరికిన భార్య.. ప్రియుడితో కలిసి గొంతు నులిమి భర్త హత్య

ఉపాధ్యాయుడి సమయస్ఫూర్తి - నిలిచిన 1643 మంది చిన్నారుల ప్రాణాలు

తెలంగాణాలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అన్నీ చూడండి

రెండో వారంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రవితేజ 'ఇరుముడి'

'టాక్సిక్' సాహసోపేతమైన ప్రయోగం : రిషబ్ శెట్టి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments