Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కోడిగుడ్డుతో టేస్టీ కట్‌లెట్ ఎలా చేయాలి?

కోడిగుడ్డును రోజుకొకటి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. పిల్లల పెరుగుదలకు ఎంతగానో తోడ్పడే కోడిగుడ్డులో పోషకాలు దాగివున్నాయి. కోడిగుడ్డులో 11 రకాల ఆమ్లాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్‌లు, ప్రోటీన

Written By Selvi
Updated: సోమవారం, 19 జూన్ 2017 (15:51 IST)
కోడిగుడ్డును రోజుకొకటి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. పిల్లల పెరుగుదలకు ఎంతగానో తోడ్పడే కోడిగుడ్డులో పోషకాలు దాగివున్నాయి. కోడిగుడ్డులో 11 రకాల ఆమ్లాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్‌లు, ప్రోటీనులు, విటమిన్‌ ఏ, బీ, డీ, ఈ, కాల్షియం, ఫాస్ఫరస్‌, జింక్‌, తదితర పలు రకాల పోషక పదార్థాలు గుడ్డులో సమృద్ధిగా ఉన్నాయి. గుడ్డులోని విటమిన్‌ ఏ కంటి చూపు మెరుగుపర్చడానికి, విటమిన్‌ డీ ఎముకల ధృఢత్వానికి, విటమిన్‌ ఈ కాన్సర్‌ నుండి కాపాడడంతోపాటు గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తాయి. అలాంటి కోడిగుడ్డుతో వెరైటీగా కట్ లెట్ తయారీ ఎలాగో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
కోడిగుడ్డు - నాలుగు 
పొటాటో - ఆరు 
ఉల్లి తరుగు - ఒక కప్పు 
అల్లం వెల్లుల్లి ముద్ద - రెండు టీ స్పూన్లు 
పచ్చి మిర్చి పేస్ట్ -  ఒక టీ స్పూన్ 
కరివేపాకు పేస్ట్ - పావు టీ స్పూన్ 
పసుపు - ఒక టీ స్పూన్ 
కారం - రెండు స్పూన్లు 
ధనియాల పొడి- ఒక చెంచా 
గరంమసాలా - అర చెంచా, కొత్తిమీర తరుగు - పావుకప్పు,
గుడ్డు - ఒకటి(ఉప్పు కలిపి గిలకొట్టుకోవాలి), 
బ్రెడ్‌పొడి - ఒక కప్పు
ఉప్పు, నూనె - తగినంత 
 
తయారీ విధానం : స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేడయ్యాక అందులో ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముద్ద, కరివేపాకు తరుగూ, కాస్త ఉప్పూ వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక పసుపూ, కారం, ధనియాలపొడీ, గరంమసాలా వేయాలి. అందులో ఉడికించి బంగాళాదుంప వేసి మరొకసారి కలపాలి. చివరగా ఉప్పు సరిచూసి కొత్తిమీర చల్లి బాగా కలిపి దించేయాలి. 
 
చేతికి నూనెను రాసుకుని ఆలూ మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఆ ముద్దలో కోడిగుడ్డును స్టఫ్ చేయాలి. ఇలాగే మిగిలిన కోడిగుడ్లను చేసుకోవాలి. ఆపై గిలకొట్టిన గుడ్డు సొనలో దీన్ని ముంచి, బ్రెడ్‌ పొడిలో అటు ఇటు దొర్లించాలి. ఇలా చేసుకున్న వాటిని వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వీటిని వేడి వేడిగా టమోటా సాస్‌పై సర్వ్ చేస్టే టేస్ట్ అదిరిపోతుంది.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments