Dharma Sangrah
✕

రోడ్లపై పానీ పూరీ ఎందుకు? ఇంట్లోనే చేసుకోవచ్చు కమ్మగా... ఇలా....

పూరీ : ముందుగా ఒక గిన్నెలో అరకప్పు బొంబాయి రవ్వ, ఒక టేబుల్ స్పూన్ మైదాపిండి, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా కొద్దిగా నీటిని కలుపుతూ ముద్దగా చేసుకోవాలి. తర్వాత 15 నిమిషాల పాటు ఆ ముద్దను తడిగ

Written By preeti
Updated: మంగళవారం, 20 జూన్ 2017 (16:18 IST)
పూరీ : ముందుగా ఒక గిన్నెలో అరకప్పు బొంబాయి రవ్వ, ఒక టేబుల్ స్పూన్ మైదాపిండి, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా కొద్దిగా నీటిని కలుపుతూ ముద్దగా చేసుకోవాలి. తర్వాత 15 నిమిషాల పాటు ఆ ముద్దను తడిగుడ్డలో చుట్టి ఉంచాలి, ఇలా చేస్తే రవ్వ నీటిని పీల్చుకుని పిండి మృదువుగా మారుతుంది. తర్వాత కొంత పిండిని ఉండలుగా చేసి చపాతీలాగా రుద్ది దానిలో ఏదైనా మూతతో చిన్నవిగా కట్ చేసుకోవాలి. పెనంలో నూనె కాగిన తర్వాత వాటిని బంగారురంగు వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
 
స్టఫింగ్ కోసం: ఒక గిన్నెలో బాగా ఉడకబెట్టి పొట్టు తీసిన బంగాళాదుంప, ఉడికించిన పచ్చిబఠాణీలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కాస్త కారం పొడి, చాట్ మసాలా, ఉప్పు వేసి మిశ్రమంగా కలుపుకుని ఉంచుకోవాలి.
 
పానీ: గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా ఆకులు, అల్లం, పచ్చిమిర్చి వీటిని మిక్సీలో వేసి కొంత నీటిని కలిపి ద్రవం లాగా చేసుకోవాలి.
 
పూరీని తీసుకుని బొటన వేలితో ఒక రంధ్రంలా చేసి, స్టఫింగ్ కోసం చేసుకున్న మసాలాను పెట్టి, కాస్త ఉల్లిపాయలు, కారప్పూస చల్లుకోవాలి. తర్వాత, తయారుచేసుకున్న పానీ అందులో పోయాలి. అంతే పానీపూరీ సిద్ధమైనట్లే. మీరు కావాలనుకుంటే చింతపండుతో కూడా పానీ తయారుచేసుకోవచ్చు.

అన్నీ చూడండి

Weather Forecast- నవంబర్ 11 తెలంగాణ, ఏపీ వాతావరణం ఎలా వుందంటే..?

పవన్ కల్యాణ్ విడాకుల వ్యవహారంపై నోరెత్తను.. అది ఆయన పర్సనల్: అంబటి రాంబాబు

శ్యామ్ మెటాలిక్స్ ఆధ్వర్యంలో ఘనంగా ఆలోకమయ్ కోల్‌కతా

వివాహేతర సంబంధం.. డబ్బులు అడుగుతుందని చంపేసిన ప్రియుడు

మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా?

అన్నీ చూడండి

నా మొదటి వ్యాపారం విఫలమైంది.. కానీ విలువైన పాఠాలు నేర్చుకున్నా... సమంత

పవన్‌ కల్యాణ్‌తో ఆ 14 ఏళ్లు.. శ్రీరాముడి 14 ఏళ్ల వనవాసంతో పోల్చిన రేణూ దేశాయ్

Pawan to become an ascetic?: పవన్ కళ్యాణ్ సర్వసంగ పరిత్యాగిగా మారబోతున్నారా? దేశ ప్రధాని అవుతారా?

Aadi Saikumar: ఈగో రాజా నుంచి రౌడీ రాకాసి అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

Nayanthara and Ram: రజనీకాంత్, కమల్ హాసన్, ధర్మన్ లో నయనతార, రామ్ పోతినేని లుక్స్

తర్వాతి కథనం
Show comments