Daily Horoscope
✕

స్నేహమేరా జీవితం...

Updated: శనివారం, 4 ఆగస్టు 2007 (21:12 IST)
PTI PhotoPTI
నేటి యువతీయువకుల మధ్య స్నేహితుల రోజు (ఫ్రెండ్‌షిప్ డే)కి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆగస్టు నెల మొదటి ఆదివారం ఆనందోత్సవాల మధ్య స్నేహితుల రోజును జరుపుకుంటారు. ఈ సంస్కృతికి అమెరికా 1935లో శ్రీకారం చుట్టింది.

ఇంతితై వటుడింతై అన్న చందంగా ఈ సంస్కృతి విస్తరించడమే కాకుండా.. దీన్ని జరుపుకునే దేశాల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. వాటి సరసన భారత దేశం కూడా చేరింది. ప్రతి ఆగస్టు మొదటి ఆదివారం తమ స్నేహితుని ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపి, తమ ఆనందాన్ని వ్యక్త పరుచుకుంటు ఉంటారు స్నేహితులు.

అంతేకాకుండా.. ఈ దినోత్సవానికి గుర్తుగా తమకు తోచిన రీతిలో బహుమతులను కూడా అందజేస్తుంటారు. వీటిలో ఎక్కువగా.. పుష్పగుచ్చాలు, కార్డులు, చేతి బ్రాండ్స్ వంటివి ఉంటున్నాయి. స్నేహితుల దినోత్సవానికి సంబంధించి చరిత్రలో పెద్ద వివరాలు ఏమీ లేవు.

అయితే.. మానవాళి ఏర్పడినప్పటి నుంచి.. స్నేహితుల మధ్య స్నేహ సంబంధాలు బలపడుతున్నట్టు చరిత్ర ఆధారుల చెపుతున్నాయి. ముఖ్యంగా.. ఈ సంస్కృతికి నాంది పలికిన అమెరికాలో.. తమ మిత్రుల హృదయాలను అకట్టుకునేలా సందేశాలు పంపటం ఆనవాయితీగా ఉన్నట్టు చరిత్ర పుటల్లో ఉంది.

ప్రత్యేక రచన లేదా సూక్తిని రాసి బహుకరించడమే కాకుండా.. తమలోని ప్రత్యేక సృజనాత్మకతను వెలిబుచ్చుతూ.. తీయటి పాటలను రాసి తమ మిత్రులకు అందజేస్తారు. మానవ జీవితంలో స్నేహానికి ఉండే విలువైన పాత్రను వివరిస్తూ.. తమ స్నేహితులకు సందేశాలను ఈ స్నేహితుల రోజున పంపుకుంటుంటారు. ఇందుకోసం.. యునైటెడ్ కాంగ్రెస్.. 1935లో ఆగస్టు నెలలోని తొలి ఆదివారాన్ని జాతీయ ఫ్రెండ్‌షిప్ డేగా ప్రకటించింది.

అప్పటి నుంచి ఈ ఫ్రెండ్‌షిప్ డే వార్షిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇలా.. యూఎస్‌లో ఈ స్నేహితుల దినోత్సవానికి అత్యంత ప్రాముఖ్యత లభించింది. తర్వాత ఈ సంస్కృతి అన్ని దేశాలు దిగుమితి చేసుకుని.. తమ స్నేహితులకు పరస్పర అభినందలు తెలుపుకోవడం ఆరంభమైంది. ప్రస్తుతం పలు దేశాల్లో ఈ దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగాను, ఆనందడోలికల్లో మునిగి తేలుతూ జరుపుకుంటున్నారు. ఇందులో భారత దేశం కూడా ఒకటి.
About Author
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... Read More

అన్నీ చూడండి

అనిరుధ్-కావ్య మారన్ వెడ్డింగ్ రిసెప్షన్లో విజయ్-రజినీకాంత్-స్టాలిన్

హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభోత్సవ రోజునే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించిన ఏఎస్‌బీఎల్‌ లెగసీ

హైదరాబాద్ నగరానికి అప్పుడేమో మెస్సీ.. ఇప్పుడు రొనాల్డో.. రేవంత్ రెడ్డి

పరివర్తన రాజనీతి పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నందమూరి కోడలు అలేఖ్య

వెంకటగిరిలో ఓకే.. కానీ తొట్టంబేడులో మరోసారి వాయిదా పడిన ఎంపీపీ ఎన్నిక

అన్నీ చూడండి

సామాజిక మార్పు కోసం పోరాడిన పూలే చిత్రం విడుదలకు సిద్ధమైంది

రాయవలస నుంచి విడుదలైన నీతో ఓ అడుగు అంటూ ప్రేమ గీతానికి మంచి స్పందన

అప్పాకుట్టి సినిమా ప్రమోషన్-రైలులో ప్రయాణించిన విజయ్ ఆంటోనీ (video)

Chandrabose: గ్రామోఫోన్ రికార్డుల నుండి ఆస్కార్ అవార్డుల వరకు—సాంకేతిక పరిణామాన్ని నేను కళ్లారా చూశాను: చంద్రబోస్

Vijay Sethupathi :మొబైల్ యాప్ లోన్ నేపథ్యంగా విజయ్ సేతుపతి ఆవిష్కరించిన ఈగో రాజా టీజర్

Show comments