Festival Posters
✕

పచ్చి పాలు ఆరోగ్యానికి హానికరం...?

Updated: మంగళవారం, 18 డిశెంబరు 2018 (15:20 IST)
పచ్చిపాలు తాగ‌డం ఆరోగ్యానికి మంచిది కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. పచ్చిపాలకు.. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. పచ్చిపాలు తాగడం వల్ల ఆహారానికి సంబంధించిన విషతుల్యమైన బాక్టీరియా కడుపులోకి వెళ్లి తీవ్ర దుష్పరిణామాలు సంభవిస్తాయ‌ని ఈ ప‌రిశోధ‌న‌లో తేలింది.
 
పచ్చిపాలు తాగడం వలన నీళ్ల విరేచనాలు, వాంతులు, కడుపులో నొప్పి, జ్వరం, కొన్నిసార్లు మూత్ర పిండాలు దెబ్బతిని హఠాన్మరణం కూడా సంభవించవచ్చని ఈ అధ్యయనం పేర్కొంది. సూక్ష్మక్రిమిరహిత పాలు తాగడం వలన తలెత్తే ఆహార సంబంధమైన వ్యాధుల కన్నా పచ్చిపాలు తాగడం వలన వచ్చే కలుషిత ఆహార రోగాలు నూరు రెట్లు ప్రమాదకరమని వెల్లడించారు.
 
ఈ మధ్య కాలంలో పచ్చిపాలు తాగడం ఆరోగ్యానికి మంచిదనే ప్రచారం కూడా జరిగింది. ఆ పాలల్లో సహజ సిద్ధమైన ప్రొటీన్లు, బ్యాక్టీరియా ఉన్నాయని, ఇవి సూక్ష్మక్రిమిరహిత పాలల్లో ఉన్న వాటి కంటే ఆరోగ్యకరంగా ఉంటాయని కూడా చెప్తున్నారు. కానీ ఇవేవీ నిజం కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. పచ్చి పాలల్లోని ఇన్‌ఫెక్షన్‌ కారకాలైన బ్యాక్టీరియా ఆహార సంబంధ జబ్బులను ప్రధానంగా పిల్లల్లో, గర్భవతుల్లో, వయోవృద్ధుల్లో, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారిలో రేకెత్తించే ప్రమాదం ఉందని తెలిపారు. 

అన్నీ చూడండి

మహిళపై కూడా గ్యాంగ్ రేప్ కేసు పెట్టొచ్చు : ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

అక్టోబర్ 16, 2026 : తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

హైదరాబాద్‌లో నవరాత్రి అన్నప్రసాద స్థలంపై చేపల వ్యర్థాలను పారవేసిన ముస్లిం మహిళ అరెస్టు

వేగా జ్యూవెలర్స్ ఆధ్వర్యంలో 'రాగ దాండియా ఉత్సవ్' : ఎండీ నవీన్ వనమా

వివాహేతర సంబంధం... భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య

అన్నీ చూడండి

Soori 7: సూరి ఏడవ కథానాయకుడిగా సూరి 7 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది

Naga Chaitanya :మైథికల్ థ్రిల్లర్ నాగ చైతన్య వృషకర్మ సరికొత్త అడ్వెంచర్ పోస్టర్

Anupama: నా పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి లేదు. ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే అన్నారు : అనుపమ పరమేశ్వరన్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ హీరోగా అనిల్ సుంకర చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్

Teja Sajja: గరివిడి లక్ష్మి మ్యూజికల్ కాన్సర్ట్ తో గౌరవం తీసుకొచ్చే సినిమా : తేజ సజ్జా

తర్వాతి కథనం
Show comments