రోజూ ఆపిల్ తినండి.. కొలెస్ట్రాల్‌ తగ్గించుకోండి..!

యాపిల్‌లో చక్కెర మోతాదు 10నుండి 50 శాతం వరకూ ఉంటుంది. పచ్చి యాపిల్‌లో కొద్ది మొత్తాల్లో మాత్రమే స్టార్చ్ ఉంటుంది. యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ,

శుక్రవారం, 5 ఆగస్టు 2016 (10:45 IST)
యాపిల్‌లో చక్కెర మోతాదు 10నుండి 50 శాతం వరకూ ఉంటుంది. పచ్చి యాపిల్‌లో కొద్ది మొత్తాల్లో మాత్రమే స్టార్చ్ ఉంటుంది. యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది.
 
ప్రతిరోజు ఓ ఆపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదని చెబుతుంటారు. అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే ఆ పండులో ఉండే పోషక విలువలు అలాంటివి మరి. శరీరానికి యాపిల్ యాంటీ ఆక్సిడెంట్‌‌గా పని చేస్తుంది. పానీయాలలో ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కిడ్నీలలో రాళ్లు ఏర్పడటాన్ని నివారిస్తుంది. ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది.
 
ఊబకాయం, తలనొప్పి, నిద్రలేమి, కీళ్లనొప్పులు, ఆస్తమా, అనీమియా, క్షయ, నాడీ సమస్యలు, జలుబు వంటి పలురకాల సమస్యలకు ఆపిల్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు వంటి అంతర్గత కీలక అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.

ఉదరంలో గ్యాస్ తయారయ్యే తత్వం కలిగినవారు యాపిల్స్ వాడకూడదు. జీర్ణాశయంలో నివసించే బ్యాక్టీరియా యాపిల్‌లోని తీపి పదార్థాలను పులిసేలా చేయటం దీనికి కారణం. గుండె స్పందనలను క్రమబద్ధీకరించటంకోసం డిగాక్సిన్ వాడే వారు యాపిల్స్‌ని తీసుకోకపోవటం మంచిది.

అన్నీ చూడండి

ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసుకుని తమను వదిలేయాలంటూ ప్రాధేయపడిన మహిళ

పోక్సో కేసు : బండి భగీరథ్‌కు బెయిల్

శిక్షణ ఇస్తూనే విమానం నుంచి దూకి ఆత్మహత్య

వైజాగ్ టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు : భర్త శ్రీచరణ్, అత్తమామలకు సమన్లు

అమెరికాలో భార్యను చంపి.. ప్రియురాలికి ఫోటో పంపిన టెక్కీ

అన్నీ చూడండి

Naresh Vijaya Krishna: తమిళనాడు ఆదర్శంగా ఆంధ్ర లో కొత్త రాజకీయ శక్తి : నరేష్ విజయ కృష్ణ

M.S. Raju: మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ గా అగధ వుంటుంది : ఎం.ఎస్. రాజు

చంపడం సరదా కాదు.. అలా అని క్షమించడం చేతకాదు...వసుదేవసుతం రిలీజ్ ట్రైలర్

Eluru Srinu : బర్నింగ్‌ ఇష్యూ ఆధారంగా డ్యూ డేట్‌ చిత్రం ప్రారంభం

Toxic song: యశ్, కియారా అద్వానీ మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా తబాహీ సాంగ్

తర్వాతి కథనం
Show comments