కాఫీ ఎన్నిసార్లు తాగుతున్నారు...?

మంగళవారం, 17 మే 2016 (21:42 IST)
కాఫీయే కదా తాగితే ఏమవుతుందిలే అనుకుంటే మాత్రం మీకు ఊబకాయం తప్పదని వైద్యులు అంటున్నారు. కాఫీతో కొన్ని రకాలైన ప్రయోజనాలున్నా కూడా, అతి కాఫీ శరీర బరువు పెరగడానికి కారణం అవుతుందని తాజా అధ్యయనం తేల్చింది. కాఫీ సేవనం వల్ల కేవలం ఊబకాయమే కాకుండా కొన్ని రకాలైన మొండి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదముందని వెస్టరన్‌ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తెలియవచ్చింది. 
 
కాఫీని పరిమితంగా తీసుకోవాలని, అపరిమితంగా తీసుకుంటే ఇలాంటి సమస్యలు వస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కొందరు తాము కెఫీన్‌ రహితమైన కాఫీ తాగుతున్నాం కదా అని అనుకుంటారని, అలాంటి వాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
రోజుకు ఐదారు కప్పుల కాఫీని తాగేవారి ఉదరభాగంలో కొవ్వు పేరుకుపోయినట్లు తమ అధ్యయనంలో తేలిందని వారు తెలిపారు. కాఫీలో ఉండే క్లోరోజెనిక్‌ యాసిడ్‌ (సీజీఏ) కి మధుమేహాన్ని నివారించే లక్షణాలున్నాయని, అయితే దీని మోతాదు మితిమీరితే మాత్రం కొవ్వు పేరుకునే సమస్య ఉత్పన్నమవుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కాఫీ వల్ల మేలున్నా... అతిగా సేవించడం మాత్రం ప్రమాదమే.

అన్నీ చూడండి

ఔను... నేను గుంపు మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి, వీడియో

బస్సులో జర్నీ చేసిన తమిళనాడు సీఎం విజయ్ (video)

గంగా- కావేరీ నదులను అనుసంధానించడం నా జీవిత ఆశయం: చంద్రబాబు

సినీ నటి కృషి తపండ నివాసంలో వ్యాపారవేత్త మృతి.. ఏం జరిగింది?

పోలీసులకు.. ఆర్మీకి మధ్య ఘర్షణ.. 40 మంది సైనికులపై కేసు నమోదు.. ఏం జరుగుతోంది?

అన్నీ చూడండి

బిగ్ బాస్ 10 సీజన్‌లో అడుగుపెట్టాలని వుంది, నన్ను సెలక్ట్ చేయండి: నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో

OG2 : తుఫాను రాకముందు.. ఒక నిశ్శబ్ద క్షణం అంటూ.. ఓజీ 2 అప్ డేట్

Samantha career over : స‌మంత కెరీర్‌ అయిపోయింద‌న్నారు, క‌రెక్టేనేమో అనిపించింది : స‌మంత‌

వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా చిత్రం

పెద్దలను ఎదిరించి ప్రియుడిని పెళ్లాడిని జబర్దస్త్ ఫైమా

తర్వాతి కథనం
Show comments