Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

వళ్లు హూనం చేసే మొండి జలుబు... తగ్గేందుకు చిట్కాలు...

Updated: మంగళవారం, 29 జనవరి 2019 (16:19 IST)
రుతువులు, కాలాలు మారే రోజుల్లో పలురకాల వ్యాధులు ప్రబలుతాయి. వాటిలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలామందికి సోకే వ్యాధి జలుబు. జలుబు వచ్చిందంటే ఒక పట్టాన పోదు. అంతేకాకుండా అది అంటువ్యాధి కావడంతో మన నుండి ఇతరులకు సోకే అవకాశం ఉంది. ఇంట్లో ఒకరికి జలుబు పట్టిందంటే అది త్వరగా ఇంట్లో ఇతర సభ్యులకు కూడా అంటుకుంటుంది. 
 
జలుబును అలక్ష్యం చేస్తే అనేక రకాల ఇన్‌ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. కనుక జలుబు విషయంలో అజాగ్రత్త పనికి రాదు. జలుబును తగ్గించడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయి. గుప్పెడు తులసి ఆకులు, చిటికెడు రాళ్ల ఉప్పు కలిపి నమిలి ఆ రసాయనాన్ని మింగడం ద్వారా జలుబు తీవ్రత తగ్గుతుంది. తులసి టీ తాగినా జలుబు తగ్గుతుంది. జిందా తిలిస్మాత్ జలుబుకు తక్షణ విరుగుడుగా పనిచేస్తుంది.
 
ప్రతిరోజూ మూడు పూటలా కొన్ని చుక్కల జిందా తిలిస్మాత్ స్పూన్ పాలు లేదా టీతో తీసుకుంటే జలుబు త్వరగా తగ్గుముఖం పడుతుంది. జలుబు చేసినప్పుడు రాత్రివేళ పడుకునే ముందుగా వేడిపాలలో చిటికెడు పసుపు వేసి తాగితే జలుబు తగ్గుతుంది. 2 కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క వేసి బాగా మరిగించి ఆ తరువాత ఆ నీటిని వడగట్టి అందులో కొద్దిగా తేనె కలిపి తాగితే మంచిది. 

అన్నీ చూడండి

సెప్టెంబర్ నెలలో ఎండల తీవ్రత.. ఉక్కపోత.. వర్షాలు కురిసినా ఉష్ణోగ్రతలు...?

న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశం.. ప్రపంచ నాయకుల జాబితా ఇదే

Heavy Rain Alert: తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలకు అవకాశం

విశాఖలో అగ్నికి ఆహుతైన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికు సంగతేంటి?

పెళ్లికొడుకుగా మారిన శునకం.. షెర్వానీ, టోపీ, పూలదండ..

అన్నీ చూడండి

Nani: శ్రీకాంత్ మొండితనం వల్లే ప్యారడైజ్ ఆలస్యం అయింది : న్యాచురల్ స్టార్ నాని

Avengers: Endgame : అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్ : బుకింగ్స్ ఓపెన్

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం ఆదర్శ కుటుంబం టీజర్ వాయిదా

తస్సదియ్యా పాట సమయంలో సమంత ప్రెగ్నెంట్ న్యూస్ వచ్చింది.. మాతృత్వంపై...?

త్రివిక్రమ్ సమర్పణలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ అంశ్ రాబోతోంది

తర్వాతి కథనం