ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By JSK
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2016 (16:44 IST)

కూల్ వాట‌ర్ డేంజ‌ర్... వేడి నీళ్ళే ఔష‌ధ‌మ‌ట‌...ఎలాగో తెలుసుకోండి

అబ్బ‌... బ‌య‌ట నుంచి వ‌చ్చా... ఫ్రిజ్ లోంచి కూల్ వాట‌ర్ ఇవ్వు... అంటూ ఇంటికి రాగానే బాటిళ్ళు బాటిళ్ళు చ‌ల్ల‌ని నీరు తాగ‌డం మ‌నంద‌రికీ అల‌వాటు. కానీ, ఇది య‌మ డేంజ‌ర్ అంటున్నారు... జ‌పాన్ వైద్యులు. చ‌ల్

అబ్బ‌... బ‌య‌ట నుంచి వ‌చ్చా... ఫ్రిజ్ లోంచి కూల్ వాట‌ర్ ఇవ్వు... అంటూ ఇంటికి రాగానే బాటిళ్ళు బాటిళ్ళు చ‌ల్ల‌ని నీరు తాగ‌డం మ‌నంద‌రికీ అల‌వాటు. కానీ, ఇది య‌మ డేంజ‌ర్ అంటున్నారు... జ‌పాన్ వైద్యులు. చ‌ల్ల‌ని నీరు తాగితే, గుండె పోటు వ‌చ్చే ప్ర‌మాదం కూడా ఉంద‌ట‌. గుండెకు ర‌క్తం అందించే నాళాలు పూడుకుపోయి హార్ట్ ఎటాక్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. గుండెకే కాదు... కాలేయానికి కూడా చ‌ల్ల‌ని నీరు ప్ర‌మాద‌మే. ఇక క‌డుపులోని అంత‌ర్గ‌త గోడ‌లు చ‌ల్ల‌ని నీటి వ‌ల్ల దెబ్బ‌తింటాయి. దీనివ‌ల్ల క్యాన్స‌ర్ కూడా వ‌చ్చే ప్ర‌మాదం ఉంది.
 
వేడి నీళ్ళు తాగితే...చాలా రోగాల‌కు మందు!
మ‌న‌కు జ్వ‌రం వ‌స్తే... వేడి నీళ్ళు తాగ‌మ‌ని ఎందుకంటారు?  వేడి నీళ్ళ వ‌ల్ల రోగాలు త‌గ్గిపోతాయి. రోజూ ఉద‌య‌మే వేడి నీళ్ళు తాగితే త‌ల‌నొప్పి, మైగ్రేన్, అధిక ర‌క్త పోటు, కీళ్ల నొప్పులు త‌గ్గిపోతాయి. ఆస్త్మా, గొంతు నొప్పి, యూరిన్, క‌డుపు నొప్పి వంటి స‌మ‌స్య‌లు కూడా వేడి నీళ్ళు తాగితే త‌గ్గిపోతాయి. కొల‌స్ట్రాల్ పెరుగుదల కూడా వేడి నీళ్ళ‌తో ఆగిపోతుంది. ఇక క‌న్ను, ముక్కు, నోరు స‌మ‌స్య‌ల‌న్నిటికీ మందు వేడి నీళ్ళే. 
 
ప‌ర‌గ‌డుపునే వేడినీళ్లు ఇలా తాగండి...
ఉద‌యాన్నే నిద్ర లేచి 4 గ్లాసుల వేడి నీళ్ళు తాగండి. ఏమీ తిన‌కుండా క‌డుపు ఖాళీగా ఉన్న‌పుడే వేడి నీళ్ళు తాగాలి. ఆ త‌ర్వాత 45 నిమిషాల‌పాటు ఏమీ తినొద్దు...సుమీ! 
 
ప‌ర‌గ‌డుపునే వేడినీళ్లు ఇలా తాగండి...
ఉద‌యాన్నే నిద్ర లేచి 4 గ్లాసుల వేడి నీళ్ళు తాగండి. ఏమీ తిన‌కుండా క‌డుపు ఖాళీగా ఉన్న‌పుడే వేడి నీళ్ళు తాగాలి. ఆ త‌ర్వాత 45 నిమిషాల‌పాటు ఏమీ తినొద్దు...సుమీ!