Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో మొక్కజొన్న తప్పకుండా తినాల్సిందే..

వర్షాకాలంలో ప్రతిరోజూ మొక్కజొన్నను ఆహారంలో చేర్చుకుంటే.. కొవ్వును దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మొక్క‌జొన్న‌లు ప‌చ్చివి, కాల్చిన‌వి, ఉడ‌క‌బెట్టిన‌వి ఏవైనా స‌రే మ‌న శ‌రీరంలోని కొవ

Written By selvi
Updated: గురువారం, 23 ఆగస్టు 2018 (12:54 IST)
వర్షాకాలంలో ప్రతిరోజూ మొక్కజొన్నను ఆహారంలో చేర్చుకుంటే.. కొవ్వును దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మొక్క‌జొన్న‌లు ప‌చ్చివి, కాల్చిన‌వి, ఉడ‌క‌బెట్టిన‌వి ఏవైనా స‌రే మ‌న శ‌రీరంలోని కొవ్వును నియంత్రిస్తాయి. అంతేకాదు వీటిలో ఉన్న లినోలికాసిడ్‌, ఫోలికాసిడ్‌, విట‌మిన్ ఇ, బి1, బి6, నియాసిన్‌, రిబోఫ్లావిన్ వ‌ల్ల చిన్నారుల‌కు, మ‌ధుమేహ‌రోగుల‌కు కూడా ఎంతో మంచింది. జీర్ణ‌క్రియ‌ను మెరుగుపరుస్తాయి. 
 
ఉడికించి తింటే ఏ రకం మొక్కజొన్న అయినా మంచిదే. ఇందులో శక్తిమంతమైన పోషకాలతోబాటు ఎ, బి, సి, ఇ విటమిన్లూ, కొన్ని ఖనిజాలూ కూడా లభ్యమవుతాయి. కార్న్‌కి కాస్త నిమ్మకాయ రాసుకుని తినడంవల్ల వాటిల్లో శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, నియాసిన్ వంటి పోషకాలు శరీరానికి లభిస్తాయి. 
 
మొక్కజొన్నలో పుష్కలంగా ఉండే థైమీన్‌, నియాసిన్‌ అనే విటమిన్లు నాడీ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి. గర్భిణులకు అవసరమైన ఫోలేట్‌ శాతం కూడా మొక్కజొన్నల్లో ఎక్కువేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని ఫాస్పరస్ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇంకా మొక్కజొన్నలోని మెగ్నీషియం ఎముకలకు బలాన్నిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు క్సానర్‌ నిరోధకాలుగానూ పనిచేస్తాయి. 
 
ఇంకా ఆల్జీమర్స్‌, మధుమేహం, బీపీ, హృద్రోగాలనూ కార్న్ నివారిస్తుందని.. మిగిలిన ఆహారపదార్థాలకు భిన్నంగా ఉడికించడంవల్ల స్వీట్‌కార్న్‌లో యాంటీఆక్సిడెంట్ల శాతం మరింత పెరుగుతుంది. పసుపురంగు కార్న్‌లో కంటికీ చర్మానికీ అవసరమైన బీటాకెరోటిన్‌ సమృద్ధిగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

Republic of Balochistan, స్వాతంత్ర్యం ప్రకటించుకున్న బలూచిస్తాన్, పాకిస్తాన్ ఏమంటోంది?

ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి.. ఇద్దరు వ్యక్తుల అరెస్టు

శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో ఏడు కిలోల వెండి నాణేలు స్వాధీనం

రూ.700 అప్పు చెల్లించడంపై వివాదం : మధ్యలో కల్పించుకున్న వ్యక్తి దారుణ హత్య

శ్మశానవాటికలో ఆరు నెలల వయసున్న శిశువు మృతదేహం అదృశ్యం

అన్నీ చూడండి

గ్రామీణ నేపథ్యంగా సురేష్ కొండేటి బ్రాండ్ తో వస్తున్న ప్రేమనే ఊరిలో చిత్రం

Rahul Sipligunj: చిక్కుల్లో పడిన రాహుల్ సిప్లిగంజ్.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి...?

దుల్కర్ సల్మాన్.. ఐ యామ్ గేమ్ నుంచి ఎవరే నువ్వే గీతం విడుదల

Shyam Prasad Reddy: అగధ లో కామాక్షి ని చూస్తే అరుంధతి లో అనుష్క ను గుర్తుచేసింది : శ్యాం ప్రసాద్ రెడ్డి

రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ పై మాయలేడి చెంగు చెంగున దూకెరా.. సాంగ్

తర్వాతి కథనం
Show comments