భోజనం తర్వాత ఓ ముక్క డార్క్ చాక్లెట్ తింటే..? స్పూన్‌తో తినండి.. ముద్దకీ ముద్దకీ

భోజనం తర్వాత ఒక ముక్క డార్క్‌ చాకొలెట్‌ తినడం మంచిది. ఆ ముక్క సైజ్‌ మీ చేతి బొటనవేలంత ఉండాలి. అలా తింటేనే ప్రయోజనం ఉంటుంది. స్వీట్ తినాలనిపిస్తే.. ఒక డార్క్ చాక్లెట్ తినేయండి. ఇది తింటే స్వీట్‌ తినాలన

ఆదివారం, 21 ఆగస్టు 2016 (17:14 IST)
భోజనం తర్వాత ఒక ముక్క డార్క్‌ చాకొలెట్‌ తినడం మంచిది. ఆ ముక్క సైజ్‌ మీ చేతి బొటనవేలంత ఉండాలి. అలా తింటేనే ప్రయోజనం ఉంటుంది. స్వీట్ తినాలనిపిస్తే.. ఒక డార్క్ చాక్లెట్ తినేయండి. ఇది తింటే స్వీట్‌ తినాలన్న కోరిక తగ్గిపోతుంది. డార్క్‌ చాకొలెట్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్‌ ఇన్సులిన్‌ను నిరోధిస్తాయి. అలాగే వీటిలో ఉండే ఆరోగ్యవంతమైన కొవ్వు రక్తంలో చక్కెర శోషించుకోవడాన్ని నెమ్మదింపచేస్తుంది. 
 
ఇన్సులిన్‌ను విడగొడుతుంది. పంచదార, ఉప్పు, కొవ్వు ఉత్పత్తులను తినాలన్న కోరికను తగ్గించడంలో డార్క్‌ చాకొలెట్‌ చాలా బాగా పనిచేస్తుంది. ఈ చాకొలెట్‌లో అధికంగా పాలు, పంచదారలకు బదులుగా 70 శాతం కోకోవానే ఉంటుంది. అందుకని తినేందుకు 70 శాతం డార్క్‌ చాకొలెట్‌ను తీసుకోవాలి. భోజనం తరువాత ఒక ముక్క డార్క్‌ చాకొలెట్‌ తినడం మంచిది. 
 
అలాగే తినేటప్పుడు స్పూన్‌తో తింటుంటే కనుక ఒక ముద్ద పెట్టుకున్నాక స్పూన్‌ పక్కనపెట్టాలి. ఇది మీరు ఎక్కువగా తినకుండా చేస్తుంది. శరీరంలోకి అధిక కెలొరీలు చేరకుండా ఉండాలంటే గబగబా తినకూడదు. నెమ్మదిగా నమిలి తినాలి. మధ్య మధ్యలో స్పూన్‌ను పక్కన పెట్టడం మొదట్లో సిల్లీగా అనిపిస్తుంది. కాని మీ బరువును మేనేజ్‌ చేసేందుకు ఈ టెక్నిక్‌ చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రైచేసి చూడండి. స్పూన్‌తో తినని వాళ్లు వెంటవెంటనే చేతితో ముద్దలు నోట్లో పెట్టుకోకుండా ముద్దకీ ముద్దకీ మధ్య కాస్త విరామం ఇచ్చి తినాలి.

అన్నీ చూడండి

కర్నాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. సాయంత్రం 4.05 గంటలకు ప్రమాణ స్వీకారం

గంజాయి విక్రయాలను ప్రశ్నించిన యువకుడు.. కొట్టి చంపేసిన ముఠా

గద్దర్ మాట: ఒరేయ్ పవన్, అటూఇటూ ఎందుకు తిరుగుతావ్, గద్దరన్న పాట విను, వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థతో భాగస్వామ్యం చేసుకున్న భారతీయ యువ శక్తి ట్రస్ట్

మమతా బెనర్జీకి 60 మంది ఎమ్మెల షాక్... బీజేపీలో చేరుతారా?

అన్నీ చూడండి

'పెద్ది' చిత్రం టిక్కెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన సర్కారు

చెర్రీతో సెల్ఫీ కోసం ఎగబడి జాన్వీ మీద పడ్డ అభిమాని, దూదిలా లేపేసిన చరణ్ బాడీగార్డ్, వీడియో

ఏదోరకంగా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు, అందుకే తెలంగాణలో గొడవ

Chaitu: నాగ చైతన్య కు ఢిల్లీ హైకోర్టులో విజయం

Joe Sharma : జో శర్మ నటించిన ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్) ఓటీటీలోకి వచ్చేస్తుంది

తర్వాతి కథనం
Show comments