Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటి అలసటను గుర్తిస్తున్నారా? ఎలా తగ్గించాలంటే?

Written By సందీప్
Updated: సోమవారం, 24 జూన్ 2019 (18:54 IST)
కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేసినా, ఎక్కువ సేపు టీవీ చూసినా తలనొప్పి వస్తుందంటే. అందుకు కారణం కళ్లు అలసటకు గురయ్యాయని అర్థం. ఈ ఇబ్బందికి గురికాకుండా ఉండాలంటే. అలసట లక్షణాలను గుర్తించి కళ్లకు విశ్రాంతిని ఇవ్వాలి. 
 
కళ్ల మసకలు, తలనొప్పి, కంటి నుండి నీరు కారడం, కంటి మంటలు మొదలైన లక్షణాలు కనిపిస్తుంటే కళ్లు అలసిపోతున్నాయని అర్థం చేసుకోవాలి. ఇందుకు చాలా కారణాలుంటాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం. ఎస్థినోపియా అనే కళ్ల అలసటకు కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ వాడడం ప్రధాన కారణాలు. 
 
వీటితోపాటు చిన్నవిగా ముద్రించిన అక్షరాలను చదవడం, తగిన వెలుతురు లేని చోట కూర్చుని చదవడం వంటి అలవాట్ల వలన కంటి కండరాల మీద ఒత్తిడి పడి కళ్లు అలసటకు లోనవుతాయి. దాంతో డబుల్ ఇమేజ్, తలనొప్పి, మైల్డ్ మ్రైగ్రేన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
 
ఈ లక్షణాలు కనిపించినప్పుడు కంటి మీద పడే ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం తప్పకుండా చేయాలి. కంప్యూటర్ ముందు అదేపనిగా పనిచేసే వాళ్లు ప్రతిరెండు గంటలకోసారి పని ఆపేసి కనీసం 10 నిమిషాలు కళ్లకు విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. 
 
అప్పుడప్పుడూ దూరం, దగ్గర వస్తువులను చూసే కంటి వ్యాయామాలు చేయాలి. కళ్లను మూసి రెండు దోసిళ్లను కళ్ల మీద ఉంచి మోచేతులను టేబుల్ మీద ఆనించి 5 నిమిషాల పాటు అలానే ఉండాలి. ఇలా చేస్తే కళ్లకు విశ్రాంతి దొరుకుతుంది. చల్లని నీటిలో తడిపిన దూదిని మూసిన కనురెప్పల మీద 5 నిమిషాల పాటు ఉంచితే కళ్ల మంటలు తొలగిపోతాయి. 
 
కంటి నుండి నీరు కారుతున్నా, లేదా దురదలు పెడుతున్నా కళ్లు నులుముకోకుండా వైద్యుల్ని సంప్రదించాలి. మెడికల్ షాపులో దొరికే ఐ డ్రాప్స్‌ను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. రోజుకు కనీసం ఏడు గంటలపాటైనా నిద్రపోవాలి.

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో జరిగిన అమెజాన్ వార్షిక సమావేశంలో మీర్జాపూర్ తారల సందడి

పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడు.. గర్భిణీ మహిళ ఆత్మహత్య

First baby girl in 200 years: 200 సంవత్సరాల తర్వాత ఆడబిడ్డ.. పండగ చేసుకున్నారు..

Sabarimala Gold Case: శబరిమలలో బంగారం మాయం.. ప్రశాంత్‌కు బెయిల్

కొండా సురేఖ ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించిన కేఏ పాల్

అన్నీ చూడండి

Hanuman Ansh: కాంతార, ది కాశ్మీర్ ఫైల్స్‌ను వెనక్కి నెట్టిన హనుమాన్ అన్ష్

ఏవియేషన్ రంగం నుంచి హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తున్న ప్రార్థనా చాబ్రియా

మహిళల భావోద్వేగాల అంశంతో హ్యాపీ జర్నీ చిత్రం విడుదలకు సిద్ధం

Allu Aravind: అల్లు అర‌వింద్ పై యశ్ మ‌ద‌ర్ విమర్శించడంలో పసలేదు

మణిశర్మ సంగీతం హైలైట్ గా గజ సినిమా విజయం ఖాయం : సాయి రాజేష్

తర్వాతి కథనం
Show comments