గ్రీన్ టీ తాగితే నష్టాలా... ఏంటవి?

ఇప్పుడు చాలామంది ఉదయం నిద్రలేవగాని గోరువెచ్చని గ్రీన్ టీ తీసుకుంటారు. గ్రీన్ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ.. కొన్ని దుష్ప్రభావాలు కూడా లేకపోలేదు. అవేంటో ఓసారి పరిశీలిద్దాం. గ్రీన్ టీలో ఎలాంటి క్యాలరీలుండవు. అయితే కొద్దిగా షుగర్ వేయడం వల్ల,

మంగళవారం, 1 ఆగస్టు 2017 (21:20 IST)
ఇప్పుడు చాలామంది ఉదయం నిద్రలేవగాని గోరువెచ్చని గ్రీన్ టీ తీసుకుంటారు. గ్రీన్ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ.. కొన్ని దుష్ప్రభావాలు కూడా లేకపోలేదు. అవేంటో ఓసారి పరిశీలిద్దాం. 
 
గ్రీన్ టీలో ఎలాంటి క్యాలరీలుండవు. అయితే కొద్దిగా షుగర్ వేయడం వల్ల, ‘వెయిట్ లాస్ ఫ్రెండ్లీ' అనే ట్యాగ్ దానంతట అదే కోల్పోయినట్లే. ముఖ్యంగా స్వీట్ గ్రీన్ టీ త్రాగడం వల్ల బరువు తగ్గడానికి బదులుగా మరింత బరువు పెరిగే అవకాశం లేకపోలేదు. అందువల్ల సాధారణంగా బరువు తగ్గాలనుకొనేవారు గ్రీన్ టీలో షుగర్‌కు బదులుగా తేనె కలుపుకుని తాగినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. 
 
గ్రీన్ టీని మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. అదే మోతాదుకు మించితే, మనస్సు మీద దుష్ప్రభావం చూపుతుంది. గ్రీన్ టీలో ఉండే అధిక యాంటీయాక్సిడెంట్స్ హార్మోనులను విడగొట్టడం వల్ల గ్రంథుల్లో మార్పులు వస్తాయి. అందువల్ల రోజుకు ఒకటి లేదా రెండు కప్పులకు మించి తాగరాదు. 
 
గ్రీన్ టీలో కెఫిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. కెఫిన్ తక్కువగా తీసుకుంటే, శరీరానికి కొన్ని ప్రయోజనాలుంటాయి. కెఫిన్ ఎక్కువైతే శరీరంలో నార్మల్ బాడీ ఫంక్షన్స్ పని చేయడం కష్టమవుతుంది. గ్రీన్ టీలో టానిన్ అనే కంటెంట్ ఉదరంలో ఎక్కువ యాసిడ్స్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అది జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. ఎక్కువ హాని కలిగించకపోయినా, ఉదర సమస్యలకు దారితీస్తుంది. రక్తంలో న్యూట్రిషియన్స్ షోషణ గ్రీన్ టీ వల్ల మరో సైడ్ ఎఫెక్ట్ ఇది. ఇందులో ఉండే టానిన్ రక్తంలో షోషింపబడే కొన్ని న్యూట్రిషియన్స్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

అన్నీ చూడండి

12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య: క్యాండిల్‌తో మాజీ సీఎం నిరసన

ఆ రెండు పద్ధతులతో మామిడి రైతులు బాగా సంపాదించవచ్చు.. అడ్లూరి లక్ష్మణ్

ఉగ్రవాదులపై ప్రయోగించే ఉపా చట్టాన్ని ఇలా ఉపయోగిస్తారా? అంబటి రాంబాబు

పచ్చి కోడిగుడ్లతో మయోన్నైస్ ఉత్పత్తి.. నిబంధనల ఉల్లంఘనపై సీరియస్

శివంగి నోటి నుండి బతికి బైటపడ్డ వ్యక్తి, తృటిలో ఎస్కేప్, వీడియో

అన్నీ చూడండి

రాత్రి తాగుతావు, పొద్దున్నే వాగుతావు, ఒక్క మంచి పనైనా చేసావా?: ప్రకాష్ రాజ్ పైన బండ్ల పంచ్‌లు

రామాయణంలో శ్రీరాముడి తొలి లుక్‌కు వెనుక ఉన్న ఆభరణాలను ఆవిష్కరించిన ట్రైబ్ అమ్రపాలి

'ప్రశ్న' రావణ్ మొబైల్ ఫోనులో మావోయిస్టులను కీర్తిస్తూ ప్రసంగాలు

Naga Vamsi: మేం చేయాల్సిన డామేజీ మేం చేస్తాం : నాగ వంశీ

Satyadev :ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా సమవర్తి నుంచి సత్యదేవ్ లుక్

తర్వాతి కథనం
Show comments