Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనె, ఉల్లిపాయరసం కలిపి తీసుకుంటే..? రోజూ గోధుమ జావ తాగితే?

ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ ఈ చిట్కాలు పాటించాలి. అప్పుడు అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. రోజూ రెండుసార్లు బ్రష్ చేసుకోవడం ఉత్తమం. వేడి నీటిని సేవించడం ద్వారా బరువు తగ్గుతారు. ఒక గ్లాసు నీటి

Written By Selvi
Updated: గురువారం, 5 జనవరి 2017 (17:54 IST)
ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ ఈ చిట్కాలు పాటించాలి. అప్పుడు అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. రోజూ రెండుసార్లు బ్రష్ చేసుకోవడం ఉత్తమం. వేడి నీటిని సేవించడం ద్వారా బరువు తగ్గుతారు. ఒక గ్లాసు నీటిలో తులసి, వేపాకులు, కొద్దిగా మిరియాలు వేసి మరిగించాలి. ఈ నీటిని ఉదయాన్నే తాగడం ద్వారా శరీరానికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్యాలు దరిచేరవు.
 
ప్రతి రోజు అల్లంతో టీ తాగాలి. దీనివల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపులో మంట, పొట్టకు సంబంధించిన సమస్యలు దూరమౌతాయి. ఇంకా గోధుమ జావ తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరగాలంటే.. ఒక స్పూన్ తేనేలో చిటికెడు కుంకుమపువ్వు కలుపుకుని తీసుకుంటే సరిపోతుంది.ఇలా చేస్తే చర్మానికి ప్రత్యేక నిగారింపు సంతరించుకుంటుంది.
 
రోజుకు ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెలో అంతే మోతాదులో ఉల్లిపాయరసం కలిపి తీసుకుంటే క్రమంగా చర్మం కాంతిమంతమవుతుంది. ప్రతి రోజు కనీసం 6 గ్లాసుల నీళ్లు తాగడం మరిచిపోవద్దు. రోజుకి మూడు, నాలుగు సార్లు తులసి ఆకులను నమలాలి. నమిలితే వచ్చే రసాన్ని మింగడం వల్ల శరీరానికి మంచిది. ఇక 
 
ఉదయం, సాయంత్రం వేళల్లో పూట కొద్దిసేపు తప్పనిసరిగా నడవాలి. ఇలా చేయడం వల్ల డయాబెటీస్ అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

కొడుకు అలాంటి వాడని తెలిసి నా జీవితమెందుకు బలి చేసారు?: జోగి రమేష్ కోడలు మేఘన

రీల్స్ కోసం కారుపై గర్ల్‌ఫ్రెండ్ ముద్దులు - ప్రియుడికి అపరాధం

ఉమ్మెత్తను అమ్మే డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం

పిన్ని పిన్నీ అంటూ తరచూ ఇంటికి వచ్చి ఆమెతోనే వివాహేతర సంబంధం, భర్త చూసేసరికి...

రిటైర్మెంట్ దిశగా నితిన్ గడ్కరీ - కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాలంటూ కామెంట్స్

అన్నీ చూడండి

Dil Raju: సంక్రాంతి సిద్దమవుతున్న రవితేజ, దిల్ రాజు ల దాగుడు మూతలు దండాకోర్.

'ఇరుముడి' సినిమా చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు : రవితేజ

Toxis Rates: ఐదు షోలకు ఆదరణ వుంటుందా? తెలంగాణాలో టాక్సిస్ టికెట్ల ధరలు పెంపు

Deepthi Nadiminti :సినిమా తీసి మోస పోయా - ఆహ్వానించినా పబ్లిసిటీకి రాలేదు : దీప్తి ఆవేదన

Anasuya Bharadwaj: నా వ్యాఖ్యలు అందిరినీ మెప్పించకపోవచ్చు : అనసూయ భరద్వాజ

తర్వాతి కథనం
Show comments