లేటుగా తిండి తింటే.. నిద్రెక్కడ పడుతుంది.. శారీరక శ్రమ చాలా అవసరమండోయ్..

నిద్రపట్టట్లేదా.. అయితే లేటుగా తిండి తినడం.. మానేయండి. రాత్రి భోజనం లేటుగా తీసుకునే అలవాటుంటే.. వెంటనే మార్చుకోండి. పదికి తర్వాత రాత్రిపూట అన్నం తీసుకుంటే నిద్రలేమి సమస్య తప్పదు. లేటుగా తింటే కడుపులో

బుధవారం, 23 నవంబరు 2016 (13:13 IST)
నిద్రపట్టట్లేదా.. అయితే లేటుగా తిండి తినడం.. మానేయండి. రాత్రి భోజనం లేటుగా తీసుకునే అలవాటుంటే.. వెంటనే మార్చుకోండి. పదికి తర్వాత రాత్రిపూట అన్నం తీసుకుంటే నిద్రలేమి సమస్య తప్పదు. లేటుగా తింటే కడుపులో ఆమ్లాల ఉత్పత్తి పెరిగి, నిద్ర కష్టమవుతుంది. నిద్ర పోవటానికి 2-3 గంటల ముందే భోజనం చేసెయ్యాలి. ఆకలి అనిపిస్తే పడుకోబోయే ముందు ఏదైనా తేలికపాటి చిరుతిండి తినొచ్చు.
 
అలాగే మద్యం సేవించడం.. శారీరక శ్రమ లేకపోవడం కూడా నిద్రలేమికి కారణం అవుతుంది. పగలు కాఫీ టీలు రెండు మూడు కప్పులకంటే ఎక్కువ తీసుకోకండి. నిద్రపోయేందుకు 2-3 గంటల ముందు నుంచీ వీటిని తాగొద్దు. అలాగే ఒంటికి శ్రమ ఉంటేనే తర్వాత విశ్రాంతి తీసుకోగలుగుతుంది. కాబట్టి రోజూ కొంత వ్యాయామం తప్పనిసరి. రాత్రిపూట శ్రమ ఎక్కువగా ఉండే వ్యాయామం చెయ్యొద్దు.
 
5. నిద్రపోయే ముందు ఇంట్లో పెద్ద లైట్లు, ధ్వనులు, టీవీ షోస్‌ వంటివన్నీ బంద్‌ చెయ్యాలి. పడుకోవటానికి ఓ అరగంట ముందు నుంచీ.. సంగీతం వినటం, పుస్తకం చదవటం వంటి మనసుకు ప్రశాంతతనిచ్చే పనులు చెయ్యాలి. నిద్రించేందుకు 15 నిమిషాల ముందు అరటిపండు, ఓ గ్లాసుడు పాలు తీసుకోవడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

భూవివాదం... చెల్లికి సపోర్ట్ చేసిందని మహిళను హత్య చేసిన సోదరుడు

మూడు, నాలుగు మంది పిల్లలు సరే.. సిజేరియన్‌తో హై రిస్క్.. హెచ్చరిస్తున్న వైద్యులు

Love Affair: కుమారుడి ప్రేమ వ్యవహారం జరిగిన హత్య.. పది మందికి జీవిత ఖైదు

సహ విద్యార్థినిపై అత్యాచారం చేసిన బీటెక్ విద్యార్థి.. మద్యం మత్తులో...?

ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో తీవ్రమైన వడగాలులు- అనేక జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ

అన్నీ చూడండి

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్ రాబోతోంది

ట్రెండింగ్‌: కరుప్పు చిత్రంలో నటి త్రిష కృష్ణన్‌ ఇల్లు

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

తర్వాతి కథనం
Show comments