Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఆకుకూరల్ని కుక్కర్లో మూతపెట్టి వండుతున్నారా?

రోజూ ఓ కప్పు మోతాదులో ఆకుకూర వంటకాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఆకుకూరల ద్వారా అనేక రకాల ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఆకుకూరల్లో కెలోరీలు, కొ

Written By Selvi
Updated: శుక్రవారం, 14 జులై 2017 (17:38 IST)
రోజూ ఓ కప్పు మోతాదులో ఆకుకూర వంటకాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఆకుకూరల ద్వారా అనేక రకాల ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఆకుకూరల్లో కెలోరీలు, కొవ్వు తక్కువ. అయితే ఈ ఆకుకూరలను వండేటప్పుడు రెండు మూడుసార్లు కడగాలి. ఎందుకంటే.. చిన్న పురుగులు, దుమ్ము, వంటివి తొలగిపోతాయి. 
 
కడిగేటప్పుడు పావు స్పూన్ ఉప్పు వేసి శుభ్రం చేస్తే ఇంకా మంచిది. ఇలా చేయడం ద్వారా క్రిములు చనిపోతాయి. అలాగే ఆకుకూరలను వండే సమయంలో మూతలు పెట్టి వండటం ద్వారా మనకు పూర్తి పోషకాలు లభిస్తాయి. వీలైనంతవరకు కుక్కర్లో వండటం మంచిది. ఆకుకూరలు ఉడికించిన తర్వాత ఆ నీటిని పారేయకుండా ఉప్పు, నిమ్మరసం కలిపి సూప్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. 
 
ఆకుకూరల్లో రోజుకో రకం బచ్చలి, మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు, తోట కూర, కొయ్యతోటకూర, అవిశాకు, మునగాకు, గోంగూర, చింతచిగురు, పొన్నగంటి, పాలకూర, చుక్కకూరను ఎక్కువగా వాడాలి. ఆయాకాలంలో చౌకగా దొరికే ఆకు కూరలను ప్రతిరోజు ఏదో రూపంలో వాడడం మంచిది. 
 
పెసర పప్పు, పాలకూర, కరివేపాకు పొడి, పుదీనా పచ్చడి, గోంగూర పప్పు, ఆకుకూర పకోడి, బచ్చలి-బజ్జి వంటి వెరైటీలుగా ఆకుకూరల్ని ఆహారంలో చేర్చుకోవచ్చు. క్యాల్షియం, విటమిన్‌ ‘ఎ', ‘సి', ఇనుము, ఫోలిక్ యాసిడ్ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

ఆ 3 రాష్ట్రాలకు బొద్దింకలు రాలేవు, ఎందుకో తెలుసా?

టీడీపీ, జనసేన మద్దతుదారుల మధ్య విభేదాలు.. ఫేక్ అకౌంట్లు.. ఎన్డీఏ ఆందోళన

వైకాపాకు తేరుకోలేని షాక్... ఏకంగా వందలాది కుటుంబాలు టీడీపీలో చేరిక

ఐఫోన్ దొంగతనం - పాస్‌వర్డ్‌ కోసం ఓనర్‌కే రిక్వెస్ట్

Sai Reddy: ముస్లింలు, క్రైస్తవులు హిందూ దేవాలయాలకు వచ్చినప్పుడు అలా చేయరెందుకు?

అన్నీ చూడండి

Shruti Haasan: ఆ టాయ్స్‌ గురించి ఓపెన్‌గా మాట్లాడిన శృతిహాసన్

ఆకట్టుకునేలా గుడ్ టైమ్ ట్రైలర్ : అనిల్ విశ్వనాథ్, కామాక్షి భాస్కర్ల

Shweta Basuprasad: వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్ వెబ్ సిరీస్ నా వైఫ్ మిస్సింగ్

Sree Vishnu: నక్సల్ బ్యాక్‌డ్రాప్‌ అయినా మంచి ఎంటర్టైనర్ చిత్రం కామ్రేడ్ కళ్యాణ్ : శ్రీ విష్ణు

Indian 3 update : ముగ్గురు వ్య‌క్తులు గుర్రాల‌పై వెళ్ళే పోస్టర్ తో భార‌తీయుడు 3 అప్ డేట్

తర్వాతి కథనం
Show comments