మొలకొచ్చిన వెల్లుల్లి తింటే ఏమవుతుంది?

వెల్లుల్లిపాయల నుంచి మొలకలు రాగానే వాటిల్లో ఇంకేమీ సారం లేదని చెత్తలో పారేస్తారు. కానీ మొలకొచ్చిన వెల్లుల్లిలో తాజా వాటికన్నా గుండెకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు మరింత క్రియాశీలకంగా వుంటాయని నిపుణులు చెపుతున్నారు. లేతగా వుండే పాయలు, కాస్త ముదిరిన పా

మంగళవారం, 13 జూన్ 2017 (21:51 IST)
వెల్లుల్లిపాయల నుంచి మొలకలు రాగానే వాటిల్లో ఇంకేమీ సారం లేదని చెత్తలో పారేస్తారు. కానీ మొలకొచ్చిన వెల్లుల్లిలో తాజా వాటికన్నా గుండెకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు మరింత క్రియాశీలకంగా వుంటాయని నిపుణులు చెపుతున్నారు. లేతగా వుండే పాయలు, కాస్త ముదిరిన పాయలతో పోల్చితే ఇలా మొలకొచ్చిన పాయల్లోనే రకరకాల మెటాబొలైట్లు వున్నట్లు గుర్తించారు. 
 
సాధారణంగా ఇలాంటి పదార్థాలు గింజల మొలకల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. మొక్కలుగా మారే దశలో ఆయా మొలకలు వ్యాధుల బారిన పడకుండా ఈ మెటాబొలైట్లు రక్షిస్తాయి. దీని ఆధారంగా మొలకలొచ్చిన వెల్లుల్లిలో కనిపించే ఈ పదార్థాలు కూడా అద్భుత యాంటీ ఆక్సిడెంటల్లా పనిచేస్తాయని అంటున్నారు. అంతేకాదు...  ఐదు రోజుల వెల్లుల్లి మొలకలు తాజా రెబ్బలూ లేత రెబ్బలకన్నా ఎక్కువగా గుండెకు మేలు చేస్తాయని చెబుతున్నారు. 
 
ఎందుకంటే మామూలుగానే వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నది తెలిసిందే. కొలెస్ట్రాల్‌ని బీపీని తగ్గిస్తుంది. క్యాన్సర్ వ్యాధిని అడ్డుకుంటుంది. మొత్తంగా రోగనిరోధకశక్తిని పెంపొదిస్తుంది. అయితే మొలకలొచ్చిన వెల్లుల్లితో మరెన్నో లాభాలున్నాయని పరిశోధనలు చెపుతున్నాయి.

అన్నీ చూడండి

మైనర్ బాలికను పార్కుకు తీసుకెళ్లి అత్యాచారం చేసిన కామాంధుడు...

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

ముద్రగడకు ప్రభుత్వ లాంఛనాలను అడ్డుకోవడం దుర్మార్గపు చర్య : జ్యోతుల నెహ్రూ

co-living తంటా, ప్రియుడి ఇంటికి వెళ్లిన యువతి, పెళ్లి చేసేసిన పెద్దలు

విఫలమైన ప్రేమ ... ఉరేసుకున్న యువతి ... మృతదేహానికి తాళి కట్టాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

Aishwarya Rajesh: హీరోయిన్ కి మూడేళ్ళ స్పాన్ అనే వారు. అదే నిజం అనుకున్నా : ఐశ్వర్య రాజేష్

జీ5 కిడ్స్ లో యానిమేటెడ్ పౌరాణిక సిరీస్ శివలోక్ కె కుండక్క మండక్క

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్, డైరెక్టర్ ప్రియదర్శన్. హైవాన్ లుక్

ప్రేమ, జ్ఞాపకాలతో తెరకెక్కిన సహ సినిమా చాలా నచ్చింది : కిరణ్ అబ్బవరం

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఆవిష్కరించిన ఫీల్ మై లవ్ ఫస్ట్ లుక్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments