కాఫీ వద్దు.. చికెన్ సూప్ తీసుకోండి.. వ్యాధినిరోధక శక్తిని పెంచుకోండి..

రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే.. రోజుకు 7- 8 గంటల పాటు నిద్ర అవసరమని.. సరిపడ నిద్రపోవడం ద్వారా హార్మోన్లు సమతుల్యం అవుతాయని.. ద్వారా భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరగాలంటే డైట్‌లో చేప

Written By Selvi
Updated: బుధవారం, 29 మార్చి 2017 (15:41 IST)
రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే.. రోజుకు 7- 8 గంటల పాటు నిద్ర అవసరమని.. సరిపడ నిద్రపోవడం ద్వారా హార్మోన్లు సమతుల్యం అవుతాయని.. ద్వారా భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరగాలంటే డైట్‌లో చేపలు, తృణధాన్యాలు, బిటాకెరోటిన్, పాలకూర, క్యారెట్ వంటివి తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. 
 
వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం ద్వారా బరువు తగ్గడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వారంలో కనీసం నాలుగు రోజులైనా వ్యాయామం చేసుకోవడం మంచిది. ఇంకా కాఫీని మానేయడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజుకు పది గ్లాసుల నీరు సేవించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే..? కార్యాలయాల్లో గంటల పాటు కుర్చీలకు అతుక్కుపోకుండా.. గంటకోసారి ఐదు లేదా పది నిమిషాలు నడవండి. సెలవు దినాల్లో విహార యాత్రలకు వెళ్లండి.
 
డైట్‌లో చికెన్ సూప్‌ను తీసుకోవాలి. ఇందులోని పోషకాలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే పెరుగును రోజూ ఒక కప్పు తీసుకోవాలి. సూర్యకిరణాలు శరీరంపై పడేట్లు చూసుకోవాలి. సూర్యోదయ కిరణాలు శరీరంపై పడటం ద్వారా విటమిన్ డి పొందవచ్చు. అలాగే సూర్య అస్తమయం సందర్భంగా పడే కిరణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆపిల్ పండును రోజుకొకటి తీసుకోవాలి. ఆరెంజ్ పండ్లను డైట్‌లో చేర్చుకోవాలి.

అన్నీ చూడండి

ముద్రగడ పద్మనాభం మృతి... ప్రభుత్వ అధికారిక లాంఛనాలు వద్దన్న కుటుంబీకులు

ఎలక్ట్రిక్ స్కూటర్‌కు చార్జ్ చేస్తుండగా మంటలు... ఇద్దరు మృతి

పెళ్లి సంబంధం చూస్తున్నారని గుండు చేయించుకున్న యువతి, వీడియో

నదుల అనుసంధానంతోనే కరువు కష్టాలు తీరుతాయి : సీఎం చంద్రబాబు

నేను దోషిని కాదు, అందుకే చనిపోతున్నా: నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్న హరికృష్ణ సెల్ఫీ వీడియో

అన్నీ చూడండి

వినాయక్ గారికి, V N ఆదిత్య ప్రారంభించిన కరుణామయ చిత్రం

Anna Lezhneva: పవన్ సొంత ఖర్చులే; డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపిన అన్నా లెజినోవా

యూనియన్ బ్యాంకు చర్యలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన బండ్ల గణేశ్

అంత:పురం తర్వాత వదలా చిత్రం బెస్ట్ ఫిల్మ్. గ్లింప్స్ : తమ్మారెడ్డి భరద్వాజ్

ఎట్టకేలకు ఈ నెల 23వ తేదీన 'జన నాయగన్' మూవీ రిలీజ్

తర్వాతి కథనం
Show comments