మార్నింగ్ వాక్ తర్వాత నిమ్మరసం సేవిస్తే... సెప్టెంబరు నెలలో ఆరోగ్య చిట్కాలు

మంచి ఆరోగ్యం పొందాలంటే వాతావరణానికి తగ్గట్టు మన దినచర్య ఉండాలి. ముఖ్యంగా ఆగస్టు - సెప్టెంబరు నెలల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే వర్షాకాలం తగ్గుముఖం పడుతుంటుంది. ఇలాంటి వాతావరణంలో జబ్బులు విపరీ

Written By chitra
Updated: శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (11:13 IST)
మంచి ఆరోగ్యం పొందాలంటే వాతావరణానికి తగ్గట్టు మన దినచర్య ఉండాలి. ముఖ్యంగా ఆగస్టు - సెప్టెంబరు నెలల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే వర్షాకాలం తగ్గుముఖం పడుతుంటుంది. ఇలాంటి వాతావరణంలో జబ్బులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు వైద్యులు. 
 
కాబట్టి ఇలాంటి వాతావరణంలో చాలాసేపు జాగింగ్ లేదా వ్యాయామం చేయకండి. అలాగే రాత్రిపూట భోజనం ముగించిన తర్వాత ఆలస్యంగా పడుకోవడం లేదా నిద్ర మేల్కోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు వైద్యులు. 
 
ఈ నేలల్లో అలసత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. బెడ్‌పై నుంచి లేవబుద్ధి కాదు. కానీ అలసత్వం చేయడం మంచిది కాదు. క్రింద పేర్కొన్న చిట్కాలను పాటిస్తే ఆరోగ్యంతోపాటు శరీరం బలవర్ధకంగా మారుతుందంటున్నారు వైద్యులు. 
 
* ఉదయం త్వరగా నిద్ర మేల్కోవాలి. వేగంగా నడవడం ఆరోగ్యానికి ఎంతో లాభం.
* మార్నింగ్ వాక్ చేసిన తర్వాత నిమ్మకాయ రసాన్ని సేవించండి.
* చల్లటి నీటితో స్నానమాచరించండి.
* ఉదయం తేలికపాటి అల్పాహారం తీసుకోండి. ఉదయం త్రాగునీరు ఎక్కువగా తీసుకోండి. పండ్లను ఎక్కువగా తీసుకుంటే మరీ మంచిది.
* ఈ నెలల నుంచి పండుగలు ప్రారంభమౌతాయి. కాబట్టి పండుగల పేరుతో ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి. 
* సెప్టెంబర్ నెలను అనారోగ్యాలను మోసుకువచ్చే నెలగా చెపుతుంటారు, ఎందుకంటే ఈ నెలలో మట్టి ద్వారా కీటాణువులు ఎక్కువగానే ఉత్పన్నమౌతాయంటున్నారు ఆరోగ్యనిపుణులు. 
* ప్రస్తుతం దేశంలో స్వైన్‌ఫ్లూ, మలేరియా, డెంగ్యూ మరియు వైరల్ వ్యాపిస్తోంది. కాబట్టి శుభ్రతపై ప్రత్యేక దృష్టిని సారించండి. 
* బయటినుంచి వచ్చిన తర్వాత చేతులు, కాళ్ళు, ముఖాన్ని కడుక్కోవడంలో అలసత్వం చేయకండి.
* ఈ నెలల్లో శరీర చర్మంలో మార్పులు సంభవిస్తాయి. దీంతో చర్మ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించండి.

అన్నీ చూడండి

ఈ వేసవిలో దుబాయ్‌లో పిల్లలకు వినోదాన్ని అందించండి

రీల్స్ తీసే కెమెరామెన్‌‍ను పెళ్లాడిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు... ఎవరా అదృష్టవంతుడు?

తోటి ఉద్యోగులు పట్టించుకోలేదు.. ఆ స్ట్రీట్ డాగ్ విశ్వాసం చూపింది (వీడియో)

ప్రధాని మోడీ ట్వీట్‌తో ఒరిగేదేమీలేదు : ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందే : సీజేపీ

విద్యార్థుల ఆందోళనపై బాలీవుడ్ నటుల మౌనం : శశిథరూర్ విమర్శలు

అన్నీ చూడండి

విజయ్ నటించిన జననాయగన్‌ను తల్లితో కలిసి వీక్షించిన త్రిష

Romanchakam :సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం రాబోతోంది

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఫైనల్.. ట్రైలర్ విడుదల

Jana Nayakudu review :ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథతో జన నాయకుడు..రివ్యూ

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

తర్వాతి కథనం
Show comments