ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 23 అక్టోబరు 2022 (15:05 IST)

తిప్పతీగ ఆరోగ్య ప్రయోజనాలు.. బరువుకు నో.. మధుమేహానికి చెక్

Tippa Teega plant
తిప్పతీగలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. శరీరంలో ఏర్పడిన కొవ్వును ఇది కరిగిస్తుంది. దీని కారణంగా శరీర ఆకృతి మెరుగుపడుతుంది. అలాగే ఒత్తిడిని దూరం చేస్తుంది. 
 
అలాగే తిప్పతీగ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తిప్పతీగలోని మూలకాలు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటమే కాకుండా శరీరం నుంచి ప్రమాదకరమైన టాక్సిక్ యాంటీఆక్సిడెంట్లను తొలగించడానికి కూడా పనిచేస్తాయి.
 
మధుమేహాన్ని అదుపులో వుంచడంలోనూ తిప్పతీగ భేష్‌గా పనిచేస్తుంది. మధుమేహం వున్నవారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తిప్పతీగ జ్యూస్ తాగవచ్చు. ఈ జ్యూస్ శరీరంలో చక్కర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.