Daily Horoscope
✕

తమలపాకు-పచ్చకర్పూరం-వెన్నను కలిపి నమిలితే?

Written By సందీప్
Updated: శుక్రవారం, 28 జూన్ 2019 (18:30 IST)
ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అనేక మంది కంటి సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చదువుకునే పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం సరైన పోషణ అందకపోవడం లేదా కంటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించకపోవడం. కంటి చూపు సమస్యకు మందలు వాడి నయం చేసుకోవాలని చాలా ప్రయత్నిస్తారు. కానీ కొన్నిసార్లు ప్రయోజనం ఉండదు. 
 
సహజసిద్ధంగా ప్రకృతిలో లభించే పదార్థాలతో మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. పైగా దుష్ప్రభావాలు కూడా ఏమీ ఉండవు. రెండు పలుకుల పచ్చకర్పూరం తీసుకుని కొంచెం మంచి గంధాన్ని కానీ లేదా వెన్నను కానీ కలిపి తమలపాకులో వేసుకుని నమిలి రసాన్ని మింగితే కంటికి సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా శరీరంలోని వేడి కూడా తగ్గుతుంది. 
 
ఈ పచ్చకర్పూరం తీసుకోవడం వల్ల కళ్లు మంటలు, కళ్లు ఎరుపెక్కడం, కళ్లలో నుండి నీరు కారడం, తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. కంటిచూపు మెరుగుపడుతుంది. కరివేపాకు కూడా కంటి చూపుకు సహకరిస్తుంది. దీనిలో ఉండే విటమిన్ ఎ కంటిచూపుని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ రెండు కరివేపాకు రెమ్మల్ని తినడం వల్ల కంటి సమస్యలు దూరమవుతాయి. 
 
అంతేకాకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కళ్లకు మేలు చేయడంలో పొన్నగంటికూరకు దానికదే సాటి. తరచూ ఈ కూర తినడం వల్ల కంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. పిల్లలకు కంటి సమస్యలు ఉంటే పొన్నగంటి ఆకు రసం రోజూ ఓ కప్పు తాగించాలి. అలాగే గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, నట్స్, చేపలు, గుడ్లు, క్యారట్, టొమాటో వంటి వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే కంటిచూపు మెరుగుపడుతుంది.

అన్నీ చూడండి

మహారాష్ట్ర అధికార కూటమిలో ఆడియో క్లిప్ కలకలం

అది చేతి రాతనా.. ప్రింటింగా? నేపాల్ యువతికి చేతిరాతతో ప్రపంచ గుర్తింపు

పెళ్లి పేరుతో వివాహేతర సంబంధం - రూ.1.18 కోట్లు వసూలు చేసిన కేటుగాడు

ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తున్న అతి తీవ్ర తుఫాను అర్నాబ్

హమ్మయ్య పులిని పట్టేశారు.. నరభక్షక పులిని పట్టుకున్న సిబ్బంది

అన్నీ చూడండి

బలహీన పురుషుడి సంతోషం కోసం మహిళను అణిచివేస్తారా? ఉపాసన ప్రశ్న

Fauzi File Number 25: సోల్జర్‌ ఫౌజీ గా సరికొత్త శకం క్రియేట్ చేసిన రెబల్ ప్రభాస్ ఎలా?

Singha Update: ఆకట్టుకునే గోపీచంద్ జంగిల్ పోస్టర్లతో సింగా చిత్రం సగభాగం పూర్తి

Vijay Deverakondaఫ రణబాలి నా జీవితానికి అర్థాన్నిచ్చింది, రాయలసీమ రుణం తీర్చుకున్నా -విజయ్ దేవరకొండ

Trivikram: నాకు, వెంకటేష్ కి కూడా AK47 కథ ఫస్ట్ అటెంప్ట్.: త్రివిక్రమ్ శ్రీనివాస్

తర్వాతి కథనం
Show comments