కూర‌గాయ‌ల‌తో డైట్ డ్రింక్‌... ఉపయోగం ఏంటి...?

బరువు తగ్గాలని ప్రయత్నించేవారు డైట్‌లు, వెయిట్‌లు అంటూ హైరానాపడుతూ ఉంటారు. ఇటువంటి వారికి సరికొత్త డైట్‌ డ్రింక్‌ను అమెరికా వైద్య కళాశాల శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కూరగాయల రసం తాగితే అధిక బరువు వున్న పెద్దవారిలో ఎంతో మార్పు కనిపించినట్లు వారు చెబ

Written By CHJ
Updated: బుధవారం, 4 మే 2016 (14:52 IST)
బరువు తగ్గాలని ప్రయత్నించేవారు డైట్‌లు, వెయిట్‌లు అంటూ హైరానాపడుతూ ఉంటారు. ఇటువంటి వారికి సరికొత్త డైట్‌ డ్రింక్‌ను అమెరికా వైద్య కళాశాల శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కూరగాయల రసం తాగితే అధిక బరువు వున్న పెద్దవారిలో ఎంతో మార్పు కనిపించినట్లు వారు చెబుతున్నారు. సోడియం తక్కువగా వుండే వెజిటెబుల్‌ జ్యూస్‌ ప్రతిరోజూ తాగినవారు 12 వారాల్లో రెండు కేజీల బరువు తగ్గినట్లు చెబుతున్నారు. 
 
జ్యూస్‌ను టమోటాలతో కలిపి అన్ని రకాల కూరగాయలు వేసి చెయ్యాలి. ఈ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. అప్పుడు ఆహార పదార్థాలు తక్కువ తీసుకుంటారు. డిన్నర్‌ తీసుకునే ముందు ఓ గ్లాస్‌ వెజిటేబుల్‌ జ్యూస్‌ సిప్‌ చేస్తే, మిగిలిన చిరుతిళ్ళ జోలికి వెళ్ళడం కూడా చాలావరకు తగ్గుతుంది. శరీరానికి కావలసిన పోషకాలు కూడా లభిస్తాయి. కూరగాయలలోని సాల్యుబుల్‌ పీచు, తక్కువ సోడియం శాతాలు అధిక బరువును నియంత్రించడంలో ఎంతో సాయపడతాయి. పాలకూర, కీరా, సొరకాయ వంటివి ఈ జ్యూస్‌లో ఉపయోగించినట్లైతే మరింత మంచిదని వారు చెబుతున్నారు. ఇలా కూర‌గాయ‌ల జ్యూస్ తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యం, అందం రెండూ సొంతం చేసుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. మొత్తంమీద శాకాహారమే కాదు కూరగాయల జ్యూస్‌లు కూడా గొప్ప మేలే చేస్తాయన్న మాట!

అన్నీ చూడండి

వందేమాతరాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలుశిక్ష : కేంద్రం

నెలకు ఇంటి అద్దె రూ.80 వేలు.. అయినా క్యాబ్ డ్రైవర్

నిలకడగా వాంగ్‌చుక్ ఆరోగ్యం... కాక్రోచ్ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ పిలుపు

నేతలెవ్వరూ గాంధీ భవన్ వైపు రావొద్దంటున్న సీఎం రేవంత్ రెడ్డి

మామ ప్రైవేట్ భాగాన్ని బ్లేడుతో కోసేసిన కోడలు (వీడియో)

అన్నీ చూడండి

'రామాయణం' చిత్రం కాదు.. భారత్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రయాణం : రకుల్ ప్రీత్ సింగ్

అవకాశాల కోసం దిగజారను : కాజల్ అగర్వాల్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments