1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 13 ఆగస్టు 2016 (11:01 IST)

ఒత్తిడికి జీర్ణశక్తికి సంబంధం ఉందా? ఉప్పు, పంచదార, నూనెల్ని మితంగా వాడండి.

జీర్ణశక్తి మెరుగవ్వాలంటే.. సూప్స్, సలాడ్స్, తాజా పండ్ల రసాలూ, కాయగూరలకూ ప్రాధాన్యం ఇవ్వాలి. కొన్ని పదార్థాలు తింటున్నప్పుడు.. శరీరం ‘ఇక తిన్నది చాల్లే’ అని సందేశం పంపుతుంది. అప్పుడు మనసుమాట వినండి.

జీర్ణశక్తి మెరుగవ్వాలంటే.. సూప్స్, సలాడ్స్, తాజా పండ్ల రసాలూ, కాయగూరలకూ ప్రాధాన్యం ఇవ్వాలి. కొన్ని పదార్థాలు తింటున్నప్పుడు.. శరీరం ‘ఇక తిన్నది చాల్లే’ అని సందేశం పంపుతుంది. అప్పుడు మనసుమాట వినండి.

అంతేకానీ.. బాగుంది కదా మరికాస్త తిందాం అని అనుకున్నారా పొట్ట, జీర్ణశక్తికీ పనిపెరిగి ఆ తర్వాత అనారోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా సహజ సిద్ధమైన పదార్థాలని తీసుకోవాలి. ఉప్పూ, పంచదార, నూనెలని మితంగా ఉపయోగించాలి. 
 
ఒత్తిడి కూడా మన జీర్ణశక్తిని బలహీనం చేస్తుంది. ఇందుకు మెగ్నీషియం, విటమిన్‌ బి, జింక్‌ ఉన్న పదార్థాలు తీసుకుంటే సమస్య అదుపులోకి వస్తుంది. ధ్యానం, దీర్ఘంగా శ్వాస తీసుకోవడం, నడక, చక్కని నిద్ర కూడా ఒత్తిడి తగ్గి జీర్ణశక్తి పెరగడానికి సాయపడతాయి. పెరుగు వంటి ఫెర్మెంటేషన్‌ పదార్థాలు జీర్ణప్రక్రియని మెరుగుపరుస్తాయి.