suvichar
✕

భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందా.. అయితే, ఓ కంట కనిపెట్టాల్సిందే!

ఆనందంగా సాగిపోతున్న మీ సంసారంలో ఉన్నట్టుండి మీ భర్త ప్రవర్తనలో తేడా కనిపిస్తుందా... మీతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారా... సంసార జీవితంలో కలతలు చెలరేగుతున్నాయా... బహుశా వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో

Written By chitra
Updated: గురువారం, 30 జూన్ 2016 (10:59 IST)
ఆనందంగా సాగిపోతున్న మీ సంసారంలో ఉన్నట్టుండి మీ భర్త ప్రవర్తనలో తేడా కనిపిస్తుందా... మీతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారా... సంసార జీవితంలో కలతలు చెలరేగుతున్నాయా... బహుశా వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో... అతను మిమ్మల్ని దూరం పెడుతున్నారా.. అప్పుడు మీరు అతని మీద అసూయ చెందుతున్నారా లేదా నిజంగానే అతను తప్పు చేస్తున్నారా? అన్న విషయాన్ని మొదట తెలుసుకోవాలి. మగవారు అడ్డదారి పడితే ఆడవారు కనిపెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
 
ఫోన్లో మాట్లాడేప్పుడు మీ వద్ద నుండి మీ శ్రీవారు దూరంగా వెళుతున్నారా లేదా రింగ్ టోన్‌ను తగ్గించి మాట్లాడుతున్నారా... ఇటువంటి లక్షణాలు మీరు తరచూ లేదా అప్పుడప్పుడు చూస్తూన్నారా? అప్పుడు మీరు అతని మీద ఓ కన్ను వేసి ఉంచాలి. ఎందుకంటే అతను మిమ్మల్ని మోసగిస్తున్నారన్న లక్షణాల్లో ఇదే ప్రధానాంశం.
 
అడ్డదారికి అలవాటుడితే సాధ్యమైనంత వరకు భార్యతో సెక్స్‌లో పాల్గొనరు. లేనిపోని సాకులు చెప్పుతూ తప్పించుకోవడం, కలిసి పడుకోవడానికి ఇష్టపడకపోవడం ఇలాంటివి మొదలవుతాయి. చాలామంది ఫోన్‌లో వచ్చిన మెసేజ్‌ని ఒక పట్టాన డిలీట్ చేయరు. ఇన్‌బాక్స్ నిండితేనే డిలీట్ వంటివి చేస్తుంటారు. అయితే మీ భర్త ప్రతిసారి మెసేజ్ వచ్చిన వెంటనే వెంటనే డిలీట్ చేస్తున్నారా? అయితే అతడిని కనిపెట్టుకుని ఉండడం మంచిది.
 
మీతో బయటకు విందులకు, శుభకార్యాలకు.. హాజరుకాకుండా... ఫ్యామిలీ ఫంక్షన్, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉంటే... మీ భర్త పర్సనల్‌గా ఇతరులతో ఎక్కువ సమయం గడుపుతున్నారని తెలుసుకోవాలి. జరిగిన గొడవని మర్చిపోయి మీరు దగ్గర అవ్వాలని చూసిన మిమ్మల్ని దూరం పెడితే అనుమానించాల్సిందే. ఎందుకంటే సామన్యంగా ప్రేమించేవారి విషయంలో పట్టుదలతో ఉండలేరు మగవారు. మరీ ముఖ్యంగా ఆడవారి విషయంలో ఉండటం కష్టం.
 
ఆఫీసు పేరుతో రాత్రుళ్ళు ఇంటికి రాకపోవడం, వేళాపాళా లేకుండా ఇంటికి రావడం.. తరుచూ బయటికి పోవడం... ఇది తరుచుగా జరిగితే ఓ కంట చూడాల్సిందే. 

అన్నీ చూడండి

శృంగారంపై స్త్రీల భావాలు ఇలా ఉంటాయట...

కొత్తగా పెళ్ళయిన భార్యతో శోభనం రోజు రాత్రి ఎలా?

ఏ వయస్సులో పెళ్ళి చేసుకుంటే స్త్రీపురుషులకు మంచిది?

ఈ విషయంలో భార్యాభర్తలు సిగ్గుపడరాదు

శృంగారం చేసిన తరువాత నీళ్ళు తాగితే ఏమవుతోంది?

తర్వాతి కథనం