కలబందతో ఆరోగ్యం, సౌందర్యం
కలబంద ఆకుల్లో నీటిని పీల్చుకునే గుణంవుంది. కలబంద రసాన్ని ముఖానికి దట్టిస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. అలాగే శరీర చర్మం కాలిపోతే కలబంద రసాన్ని కాలిన గాయాలపై పూతలా పూస్తే గాయాలు తగ్గుతాయి.
1. కలబంద ఆకుల రసంలో కొద్దిగా కొబ్బరి నూనె పోసి కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని మోచేతులు, పాదాల ముట్టి వద్ద నల్లగా ఉన్న ప్రాంతాలలో పూయండి. కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. దీంతో చర్మంపైనున్న నల్లటి మచ్చలు తగ్గుతాయి.
2. ఉదయం పరకడుపున కలబంద ఆకులను సేవిస్తే ఉదర సంబంధమైన సమస్యలుంటే తొలగిపోతాయి.
3. రోజ్ వాటర్లో కలబంద రసాన్ని కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని చర్మంపై పూస్తే పొడిబారిన చర్మం తిరిగి కళకళలాడుతుంది.
4. కలబంద రసంలో ముల్తానీ మట్టి లేక చందపు పొడి కలుపుకుని ముఖంపైనున్న మొటిమలకు పూస్తే మొటిమలు మటుమాయమౌతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.