సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: గురువారం, 23 ఆగస్టు 2018 (19:25 IST)

బార్లీ నీళ్లు తాగితే పొట్ట నిండినట్లుంది... అందుకే అవన్నీ పోతాయ్...

బార్లి అంటే మనందరికి తెలిసిందే. దీని వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అతి తక్కువఖర్చుతో కూడిన ఈ బార్లీ మనకు ఎంతో మేలు చేస్తుంది. ఈ బార్లీని ప్రతిరోజు తాగటం వలన మంచి ఫలితం ఉంటుంది. దీని ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బార్లి అంటే మనందరికి తెలిసిందే. దీని వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అతి తక్కువఖర్చుతో  కూడిన ఈ బార్లీ  మనకు ఎంతో మేలు చేస్తుంది. ఈ బార్లీని ప్రతిరోజు తాగటం వలన మంచి ఫలితం ఉంటుంది. దీని ప్రయోజనాలు ఏమిటో  ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. బార్లీలో ఉండే బీటా-గ్లూకాన్ విసర్జన క్రియలో శరీరం నుండి విషపదార్థాలను బయటకు నెట్టివేయడంలో సహాయపడుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ప్రేగుల్ని శుభ్రంగా ఉంచుతుంది.
 
2. ఈ పానీయాన్ని తీసుకోవటం వలన ఉష్ణోగ్రత ఎక్కువగా వుండే నెలల్లో శరరీంలో ఏర్పడే వేడిని తగ్గుతుంది.
 
3. ఇది ఒక శీతలీకరణి కనుక మనం స్పైసి ఆహారం తీసుకోవటం వలన కలిగే కడుపుమంటను ఈ పానీయం తగ్గిస్తుంది.
 
4. బార్లి ఒక యాంటీ-ఇన్ప్లమేటరీ. కీళ్ల నొప్పులతో బాధపడేవారు బార్లీ నీటిని తాగటం వలన మంచి ఉపశమనం కలుగుతుంది.
 
5. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఈ పానీయాన్ని ప్రతిరోజు తాగటం వలన వారి శరీరంలోని చక్కెరస్థాయిలు కంట్రోల్‌లో ఉంచడంలో తోడ్పడుతుంది.
 
6. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు ఒక గ్లాసు పానీయాన్ని తాగటం వలన రోజువారి మన శరీరానికి అవసరమయ్యే పీచుపదార్ధం భర్తీ అవుతుంది.
 
7. ఈ పానీయంలో ఉండే అధిక ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
 
8. బార్లీ రక్తపోటును తగ్గిస్తుంది. అందుకే గర్భిణీ స్త్రీలు రక్తపోటును అదుపులో ఉంచుకోవటానికి ప్రతిరోజు ఈ పానీయాన్ని సేవించటం చాలా ఉపయోగకరం.
 
9. మూత్రపిండాలలో ఉన్న రాళ్లను బయటకు పంపించటంలో బార్లీ నీళ్లు ఎంతగానో సహాయపడతాయి. కనుక  ప్రతిరోజు ఒక గ్లాసు బార్లీ నీళ్లను తాగటం వలన మంచి ఫలితం ఉంటుంది.
 
10. అధికబరువును తగ్గించుకోవటంలో బార్లీ ఎంతగానో సహాయపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్ చాలా సమయం వరకు పొట్టనిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. జీర్ణక్రియ రేటును మెరుగుపరుస్తుంది.