Daily Horoscope
✕

ప్రయాణాల్లో వాంతులయ్యేవారు ఏం చేయాలి?

చాలామందికి బస్సు ప్రయాణం పడదు. ఎక్కువగా తిరుమలకు వెళ్లేవారు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు వాంతులు ఆగవు. కడుపులో తిప్పేసినట్లయి వాంతి చేసుకుంటుంటారు. ఇలా చాలామందికి వాహన ప్రయాణాల సమయంలో వాంతులు అవుతుంటాయి. అలాంటివారు ప్రయాణానికి ముందు చిన్న అల్లం ముక్క

Written By chj
Updated: శనివారం, 1 ఏప్రియల్ 2017 (19:59 IST)
చాలామందికి బస్సు ప్రయాణం పడదు. ఎక్కువగా తిరుమలకు వెళ్లేవారు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు వాంతులు ఆగవు. కడుపులో తిప్పేసినట్లయి వాంతి చేసుకుంటుంటారు. ఇలా చాలామందికి వాహన ప్రయాణాల సమయంలో వాంతులు అవుతుంటాయి. అలాంటివారు ప్రయాణానికి ముందు చిన్న అల్లం ముక్కను బుగ్గన పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం తగ్గుతుంది.
 
ఇకపోతే అల్లంలో ఉండే క్యాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, జింక్‌ వంటివి మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు. ఆకలి వేయకుండా ఉంటే కాస్త అల్లం రసం తీసుకుంటే చక్కగా ఆకలి వేస్తుంది. అలాగే జలుబు, దగ్గు బాధిస్తుంటే అల్లం రసంలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే త్వరగా ఈ బాధలనుండి ఉపశమనాన్ని పొందవచ్చు. డికాక్షన్‌లో కొద్దిగా అల్లం, తేనె, తులసి ఆకులను వేసి కలుపుకుని తాగినా కూడా ఈ బాధలనుండి చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు. 
 
కీళ్లనొప్పులను తగ్గించడంలో అల్లం ఎంతో ఉపకరిస్తుంది. కాబట్టి రోజూ కొద్దిమేర అల్లం కూరల్లో తీసుకుంటే మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

క్రెడిట్ కార్డ్ ద్వారా రుణాలు.. బ్యాంక్ ఒత్తిడి సంగారెడ్డి టీచర్ ఆత్మహత్య

చెవిరెడ్డి అన్నకు నేను ఎస్కార్ట్: ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి, వీడియో

పులివెందుల ఎర్రిపల్లి గ్రామంలో హై టెన్షన్.. పెట్రోల్ బాంబు దాడులు

మునిసిపల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడాము, ఏపీలో ఏ ఎన్నిక జరిగినా ఇదే రిపీట్: అంబటి రాంబాబు

రెస్క్యూ బోట్లు బోల్తా.. గల్లంతైన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సేఫ్..

అన్నీ చూడండి

Nani Pooja: అయ్యప్ప స్వామి పూజలో పాల్గొన్న బ్లడీ రోమియో

Kaka: యాక్షన్ సీన్స్ లో కాకా - పాట గురించి థమన్ ఏమంటున్నారంటే..

Ramayana review: నమిత్ మల్హోత్రా రామాయణంలో రాముని శపథం ఏం చేశాడు? రామాయణం రివ్యూ

Supriya: #బాలుగీత అందరికీ రిలేట్ అయ్యే సినిమా : సుప్రియ యార్లగడ్డ

Niharika Konidela: పాకెట్ రాకెట్స్ తో మేమంతా మీ సోషల్ మీడియా, మీ ఇంట్లోకి వచ్చేస్తాం - నిహారిక కొణిదెల‌

తర్వాతి కథనం
Show comments