బాన పొట్టతో అందవిహీనంగా కనిపిస్తున్నారా... పొట్ట కరిగే చిట్కాలివిగో..

చాలా మంది బాన పొట్టతో అందవిహీనంగా కనిపిస్తుంటారు. పలువురు విపరీతంగా మద్యం సేవించడం వల్ల ఈ బాన పొట్ట వస్తుంది. మరికొందరు ఎలాంటి తిండి తీసుకోకపోయినా.. ఊబకాయం కారణంగా పొట్ట ఎక్కువగా ఉంటుంది. ఇది వారివారి

గురువారం, 5 జనవరి 2017 (09:01 IST)
చాలా మంది బాన పొట్టతో అందవిహీనంగా కనిపిస్తుంటారు. పలువురు విపరీతంగా మద్యం సేవించడం వల్ల ఈ బాన పొట్ట వస్తుంది. మరికొందరు ఎలాంటి తిండి తీసుకోకపోయినా.. ఊబకాయం కారణంగా పొట్ట ఎక్కువగా ఉంటుంది. ఇది వారివారి దినచర్యలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. 
 
ముఖ్యంగా.. మన జీవన విధానం, తీసుకునే ఆహారం, చేసే పని, ఒత్తిడి ఇత్యాది కారణాలు కూడా మనపై ఎంతో ప్రభావం చూపుతాయి. ఫలితంగా మనకు తెలియకుండానే శారీరకంగా, మానసికంగా మనలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. తీరా తెలుసుకునే లోపు జరగాల్సింది జరిగిపోతోంది. 
 
ప్రస్తుత కాలంలో ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ బాధ పడుతున్న సమస్య అధిక పొట్ట. కొందరికి శరీరం అంతా లావుగానే ఉంటుంది. మరికొంత మందికి శరీరం మొత్తం బాగుంటుంది... కానీ, పొట్ట మాత్రం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఆ ప్రదేశంలో పేరుకుపోతున్న కొవ్వే. ఇలాంటి వారు బాధపడాల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాలను పాటించినట్టయితే ఫలితం ఉంటుంది. 
 
ఉదయాన్నే ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు తీసుకుని, అందులో నిమ్మకాయను పిండి తాగండి. అవసరమైనే ఒక స్పూన్ తేనె కూడా కలుపుకోవచ్చు. నిమ్మకాయకు కొవ్వును కరిగించే అద్భుత శక్తి ఉంది. ప్రతిరోజూ నిద్రలేవగానే పరగడుపున ఒకటి లేదా రెండు టమోటాలను ఆరగించాలి. టమోటాలో ఉండే 9 ఆక్సో ఓడీఏ అనే పదార్థం కొవ్వును కరిగించివేస్తుంది. 
 
ప్రతి రోజు ఉదయాన్నే పుదీనా ఆకుల రసాన్ని తాగాలి. దీనివల్ల మెటబాలిజం పెరిగి, శరీరంలోని క్యాలరీలు కరిగిపోతాయి. ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తీసుకుని అందులో అల్లం రసం కలుపుకుని సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీని వల్ల కొవ్వు తగ్గడమే కాదు. అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇలాంటి చిట్కాలు పాటించడం వల్ల పొట్ట కరిగిపోయి అందంగా కనిపించేందుకు ఆస్కారం ఉంటుంది. 

అన్నీ చూడండి

చేతికి అందివస్తాడని బెంగళూరుకి పంపితే బెట్టింగ్ యాప్ బానిసై తిరిగొచ్చాడు, కొడుకును చంపిన తండ్రి

విజయవాడలో ఆర్టీసీ ఓ వ్యక్తిని ఢీకొంది.. ఆ తర్వాత ఏమైందంటే?

ఖమ్మం బైపాస్ రోడ్డుపై 113 కిలోల గంజాయి పట్టివేత.. విలువ రూ.56లక్షలు

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన కెనరా బ్యాంక్ సీజీఎం అలోక్ కుమార్ అగర్వాల్

తెలంగాణ పాఠశాలల సందర్శనలు మరియు సమీక్షలన్నింటినీ ఒకే వ్యవస్థతో ఎలా అనుసంధానించారు?

అన్నీ చూడండి

Chiru, Bobby: వర్షంలో 12 గంటలు తడుస్తూ షూటింగ్‌ చేసిన మెగాస్టార్ చిరంజీవి

దాదా- ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ మూవీ ఫ‌స్ట్ లుక్, 2027న సినిమా విడుద‌ల‌

Rashmika: మైసా కోసం రష్మిక రిస్కీ స్టంట్స్.. అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ పూర్తి

Sagar: వంద మందిని పరిచయం చేస్తూ కొత్త సినిమా..మేము కూడా సినిమా తీసినామురో

Naresh Vijaya Krishna: తమిళనాడు ఆదర్శంగా ఆంధ్ర లో కొత్త రాజకీయ శక్తి : నరేష్ విజయ కృష్ణ

తర్వాతి కథనం
Show comments