శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By CVR
Last Updated : బుధవారం, 4 ఫిబ్రవరి 2015 (16:01 IST)

చుండ్రు సమస్యకు గసగసాలతో చెక్...!

మన వంటింట్లో ఉండే ప్రతి వస్తువు ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే  అవి సౌందర్య సాధనాలుగా కూడా పని చేస్తాయనే విషయం కొంత మందికి మాత్రమే తెలుసు. ఇదివరకటి రోజుల్లో అనారోగ్యం ఏర్పడితే వంటింటి వస్తువుతోనే వైద్యం చేసుకుంటారు. ఇప్పుడలా కాదు ప్రతి చిన్న సమస్యకు మందులనే వాడుతున్నారు.
 
అమ్మాయిల అందానికి మరింత అందాన్ని చేర్చేవి కురువు. కురులకు వచ్చే సమస్యల్లో ప్రధానమైన చుండ్రు. తలపై వచ్చే చుండ్రును అశ్రద్ధ చేస్తే అది అట్టగట్టినట్లు అయిపోయి పొలుసులుగా, పొక్కులుగా రాలుతూ, విపరీతమైన దురదను కలిగిస్తుంది. చుండ్రు వలన వెంట్రుకల కుదుళ్లు పటుత్వాన్ని కోల్పోయి పూర్తిగా ఊడిపోవడమూ జరుగుతుంది. వీటిని వెంటనే నివారించాలి. అందుకోసం ఈ చిట్కా..
 
వంటింటిలో ఉన్న గసగసాలను కొద్దిగా తీసుకుని, వాటికి పాలు చేరుస్తూ నూరుకోవాలి. తర్వాత దానిని తలకు బాగా పట్టించి, ఆరిన తర్వాత తలంటు స్నానం చేయాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేశారంటే మూడు వారాల్లో చుండ్రు సమస్య పూర్తిగా సమసిపోతుంది.