Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నీళ్లే కదా... తాగితే ఎంత... తాగకపోతే ఏంటి?

ఆ నీళ్లే కాదా... తాగితే ఎంత... తాగకపోతే ఏంటి అని చాలామంది అనుకుంటారు. శరీరంలో ఎక్కువశాతం నీరే ఉంటుంది. ఈ నీరే ప్రాణాధారం. శరీరానికి తగినంత నీరు అందివ్వడంతో ఆరోగ్యంగా ఉంటారు. నీరు సేవించడం వలన శరీరంలోని విషపూరితమైన పదార్థాలు బయటకు విసర్జించడమే కాకుండా

Written By chj
Updated: గురువారం, 6 అక్టోబరు 2016 (18:35 IST)
ఆ నీళ్లే కాదా... తాగితే ఎంత... తాగకపోతే ఏంటి అని చాలామంది అనుకుంటారు. శరీరంలో ఎక్కువశాతం నీరే ఉంటుంది. ఈ నీరే ప్రాణాధారం. శరీరానికి తగినంత నీరు అందివ్వడంతో ఆరోగ్యంగా ఉంటారు. నీరు సేవించడం వలన శరీరంలోని విషపూరితమైన పదార్థాలు బయటకు విసర్జించడమే కాకుండా చర్మం, ఉదరం, మూత్రపిండాలలోనున్న పలురకాల విషపదార్థాలు బయటకు విసర్జించబడతాయి. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు రకరకాల జబ్బులు చోటుచేసుకుంటాయి. నీరు తక్కువగా తీసుకోవడంతో డీహైడ్రేషన్ సమస్య ఉత్పన్నమౌతుంది. 
 
శరీరంలో చేరుకునే రకరకాల జబ్బులను నీరు పారద్రోలుతుంది. కాబట్టి శరీరానికి తగినంత నీరు అందిస్తుండాలి. శరీర బరువును నియంత్రించేందుకు నీరు ఓ దివ్యౌషధంలా ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తొలగించేసే గుణం ఇందులో ఉంది. నీటిలో క్యాలరీలు, కొవ్వు, చక్కెర, కార్బోహైడ్రేట్లుండవు. నీటిని సేవించడం వలన ఎక్కువ క్యాలరీలు కలిగిన సోడా, డ్రింక్స్, మద్యం, ఇతర జ్యూస్‌లను త్రాగాలనిపించదు. 
 
శరీరంలో తగిన మోతాదులో నీరు ఉంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. నీటితో శరీరంలో శక్తి వస్తుంది. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు అలసట కలుగుతుంది. దీంతో శరీరంలో శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. తరచూ గొంతు ఎండిపోవడం, కొందరిలో కళ్ళు తిప్పడం లాంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. అలసట కారణంగా కొందరిలో బలహీనత ఏర్పడుతుంది. 
 
ఆరోగ్యకమైన చర్మ కోసం నీటిని ఎక్కువగా సేవించాలంటున్నారు వైద్యులు. తగిన మోతాదులో నీరు తీసుకుంటుంటే చర్మంలో నిగారింపు కనపడుతుంది. ఇది ఒక్కరోజులోనే జరగదంటున్నారు వైద్యులు. దీనికి నిత్యం నీటిని సేవిస్తుండాలి. అప్పుడే అనారోగ్యంబారిన పడకుండా ఉంటారు.

అన్నీ చూడండి

మెడలో తాళి కడుతుండగా ఆపండి అంటూ పెళ్లిపీటల పైనుంచి లేచిన వధువు

రిటైర్మెంట్ డబ్బు ఇవ్వనన్నందుకు భర్తను రోకలి బండతో కొట్టి చంపేసిన భార్య

Pawan Kalyan: సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉండనున్న పవన్ కల్యాణ్

చేపల వేట కోసం సముద్రంలోకి మత్స్యకారులు.. 14 రోజులు గడిచినా రాలేదు..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. ప్రజలకు అలెర్ట్

అన్నీ చూడండి

పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ ఏమి చేస్తుంది ?

హైదరాబాద్ బస్తీని అద్బుతంగా చూపించాలనుకున్నా : రమణా రెడ్డి సోమ

Ram Pothineni : రామ్ పోతినేని నటుడిగా-దర్శకుడిగా 24 గంటలు చిత్రీకరణ

Sriram: రివర్స్ టీజర్ తో ఆకట్టుకున్న ది మేజ్ చిత్రం

Sunil: కలలు నిజమైతే నిజం ఎవరిది. అనే పాయింట్ తో ఫైట్ మహా ట్రైలర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments