Dharma Sangrah
✕

లవంగాలు టీతో నరాలకు శక్తి, ఎలా చేయాలి?

Written By సిహెచ్
Updated: సోమవారం, 2 అక్టోబరు 2023 (21:44 IST)
లవంగాలు. ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాము. దగ్గుకు సహజమైన మందు లవంగం, శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 
 
ఆహారం సరిగా జీర్ణం కాకపోయినా, వాంతులు వచ్చినా లవంగాల నూనెను తీసుకుంటే ఉపశమనం ఉంటుంది. తేనె, కొన్ని చుక్కల లవంగాల నూనెను గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
 
వాతావరణం మార్పు వల్ల వచ్చే రుగ్మతలకు లవంగం మంచి మందులా పని చేస్తుంది. తులసి, పుదీనా, లవంగాలు, యాలకుల మిశ్రమంతో టీ చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. తాగే టీలో లవంగం వేసుకొని తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ఆహారంలో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది.

అన్నీ చూడండి

ఆన్‌లైన్‌లో తితిదే క్యాలెండర్లు - డైరీలు విక్రయం

ఎన్వీడియా చీఫ్‌పై గూఢచర్యం ఆరోపణలు - మా దేశంపై కుట్ర : చైనా ధ్వజం

మహిళ అందంగా కనిపిస్తే .. గూఢచర్యానికి ఒక సాధనంగా మారావని అర్థం : ఎలాన్ మస్క్

ఎన్వీడియా సీఈవోతో సీక్రెట్ సంబంధం... ఎవరా అలైస్ హువాంగ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ విజయం సాధించాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

అనిరుధ్ - కావ్య మారన్ వివాహం కోసం గ్రీస్‌కు బయలుదేరిన రజనీ - స్టాలిన్

థియేటర్లలో 'రామాయణ' మూవీ వీడియోలు తీస్తున్నారా.. అయితే జైలుకే

దక్షిణాది చిత్రాల్లో చేదు అనుభవాలున్నాయ్ : రాధికా ఆప్టే

'వెంకటలక్ష్మి రావే’… ప్రేమకు పదాల పట్టాభిషేకం

Anushka Shetty Birth Day: అనుష్క శెట్టి 45వ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు

తర్వాతి కథనం
Show comments