దాని పేరు చెబితే అందరూ ముక్కు మూసుకుంటారు. ఆ నల్లది ఉంటే చాలు మటుమాయమే..

గ్యాస్‌ సమస్య ఏర్పడినప్పుడు అందరూ చేసే పని యాంటాసిడ్‌ వేసుకోవడం. అలా కాకుండా టీ స్పూను మిరియాలను వేయించి పొడి చేసి, చిటికెడు లవంగాల పొడి, పావుచెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి, తేనెతో కలిపి రోజూ రెండు మూడుసార్లు చొప్పున

గురువారం, 29 జూన్ 2017 (08:43 IST)
గ్యాస్‌ సమస్య ఏర్పడినప్పుడు అందరూ చేసే పని యాంటాసిడ్‌ వేసుకోవడం. అలా కాకుండా టీ స్పూను మిరియాలను వేయించి పొడి చేసి, చిటికెడు లవంగాల పొడి, పావుచెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి, తేనెతో కలిపి రోజూ రెండు మూడుసార్లు చొప్పున తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల కడుపులో గ్యాస్‌ సమస్యతోబాటు జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు కూడా నయం అవుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
 
కప్పు మజ్జిగలో పావు చెంచా మిరియాల పొడిని కలిపి తీసుకోవచ్చు లేదా పసుపు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిటికెడు చొప్పున తీసుకుని నీటిలో మరిగించి రాత్రిళ్లు తాగితే జలుబు, తుమ్ములు తగ్గుతాయి. పళ్లనొప్పులకు... అర టీ స్పూన్‌ నల్ల మిరియాల పొడి, కొద్దిగా లవంగం నూనెలను తీసుకుని మిశ్రమంగా తయారు చేయాలి. దాన్ని నొప్పి పెడుతున్న పన్నుపై అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తుంటే పంటినొప్పి తగ్గడంతోపాటు పళ్లు దృఢంగా తయారవుతాయి.
 
టేబుల్‌ స్పూన్‌ తాజా నిమ్మరసం, అర స్పూన్‌ నల్ల మిరియాల పొడి, టీస్పూన్‌ ఉప్పులను ఒక గ్లాస్‌ వేడినీటిలో కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దీన్ని నోటిలో పోసుకుని పుక్కిలిస్తూ ఉంటే గొంతునొప్పి, మంట, దగ్గు తగ్గుతాయి. తలనొప్పి నివారణకు యాస్ప్రిన్‌ వేసుకోవడం అందరూ చేసే పనే. అలా కాకుండా దాల్చిన చెక్కను నీటితో తడిపి అరగదీసి కణతలకు పూస్తూ ఉంటే తలనొప్పి ముఖ్యంగా జలుబు వల్ల వచ్చే తలనొప్పి సులువుగా తగ్గిపోతుంది.
 

అన్నీ చూడండి

వాట్సప్ ద్వారా వచ్చిన లింక్ పైన క్లిక్ చేసాడు, అంతే... రూ. 10 లక్షలు కాజేశారు

ప్రియుడు మోజులో పడి భర్త దుప్పట్లోకి నాగుపాముని పంపి హత్య చేసిన భార్య

కడుపు నొప్పితో స్కాన్ కోసం వెళ్తే.. వేధించిన డాక్టర్.. వీడియో తీసి?

జూలై 21, 22 తేదీల్లో వికారాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Donkeys, Frogs: సీమలో వర్షాల్లేవు.. గాడిదలు, కప్పలకు వివాహాలు

అన్నీ చూడండి

Kiran Abbavaram,: యు/ఎ సర్టిఫికేషన్ పొందిన కిరణ్ అబ్బవరం... చెన్నై లవ్ స్టోరీ

Ravi Teja : ఇరుముడి' డబ్బింగ్ ప్రారంభించిన రవితేజ- త్వరలోనే సెకండ్ సింగిల్

శాన్‌ఫ్రాన్సిస్కోలో M4M 2 మూవీ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు

Sitara: ఎప్పటికీ చిన్నారి తార.. సితార అంటూ మహేష్ బాబు ఆప్యాయంగా ముద్దుపెట్టారు.

Vijay Deverakonda: రౌడీ జనార్థన మూవీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments