ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2016 (11:59 IST)

కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచే బీన్స్..

చాలా మంది అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతుంటారు. దీంతో గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే, కొలెస్ట్రాల్‌ను ఎల్లవేళలా నియంత్రణలో ఉంచాలంటే... బీన్స్ ఉడికించి తిన్నాసరే.. వేయించి తిన్నా ఆరోగ్యానికి ఎంతో

చాలా మంది అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతుంటారు. దీంతో గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే, కొలెస్ట్రాల్‌ను ఎల్లవేళలా నియంత్రణలో ఉంచాలంటే... బీన్స్ ఉడికించి తిన్నాసరే.. వేయించి తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలని అంటున్నారు. 
 
నిజానికి బీన్స్‌ను ప్రతి రోజూ కాకపోయినా.. వారానికోసారైనా ఆరగించాలని సలహా ఇస్తున్నారు. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం బాగా తగ్గుతుంది. దీనికి కారణం చిక్కుడు, ఇతర బీన్స్‌లో సులభంగా జీర్ణమయ్యే పీచు పదార్థం అధికంగా ఉండటమేనని చెపుతున్నారు. దీనికి కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంటుంది. ఈ బీన్స్‌లో బి విటమిన్, ఫోలేట్ అధికంగా ఉంటుంది. 
 
అంతేకాకుండా, ఈ రెండింటిలోనూ గుండె ఆరోగ్యం పెంపొందించే ఎమైనో ఆమ్లం ఉంది. గుండె ఆరోగ్యంతో పని చేయడానికి అవసరమైన పొటాషియమ్ బీన్స్‌లో సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల గుండె ఆరోగ్యం కోరుకునేవారంతా బీన్స్‌ని తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి.