సోమవారం, 18 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 16 అక్టోబరు 2016 (18:26 IST)

ఎముకలకు బలాన్నిచ్చే గ్రీన్ టీ.. స్ట్రాబెర్రీలతో మేలెంతో..

ఎముకల్ని బలంగా ఉండాలంటే.. స్ట్రాబెర్రీలు తీసుకోవాలి. స్ట్రాబెర్రీస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ ప్రోటీన్ ఎముకల బలంగా మార్చడానికి సహాయపడుతుంది. ఓట్స్ 25శాతం

ఎముకల్ని బలంగా ఉండాలంటే.. స్ట్రాబెర్రీలు తీసుకోవాలి. స్ట్రాబెర్రీస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ ప్రోటీన్ ఎముకల బలంగా మార్చడానికి సహాయపడుతుంది. ఓట్స్ 25శాతం విటమిన్ డి ఉంటుంది. కాబట్టి, ఓట్స్‌ను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా దృఢమైన ఎముకలను పొందవచ్చు.
 
ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం దాగివున్న పాలు, పెరుగు, చీజ్ వంటి వాటితో పాటు సి విటమిన్ ఫ్రూట్స్ అంటే కమలాఫలం, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, ద్రాక్షలను తీసుకోవాలి. ఇందులోని సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 
 
ఇకపోతే.. గ్రీన్‌ టీలో ఉండే ఒక గ్రూపు రసాయనాలు ఎముకల నిర్మాణాన్ని ఉత్తేజితం చేస్తాయి. దీంతో ఎముకలు విరగడం నెమ్మదిస్తుంది. ఫలితంగా ఆస్టియోపోరోసిస్‌ రావడాన్ని, చికిత్సను గ్రీన్‌టీ నివారిస్తుంది. అంతేకాక ఇతర ఎముకల సంబంధ వ్యాధులను అరికట్టే వీలుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.