జీడిపప్పు, బాదం పప్పు, ఎండుద్రాక్ష తీసుకుంటుంటే... ఏంటి లాభం?

ఒత్తిడి జీవితం. దీనితో బిపి, షుగర్ సమస్యలే కాకుండా గుండె జబ్బులు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా గుండె జబ్బును నిరోధించాలంటే జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, వాల్‌నట్స్ తదితర డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికే కాదు.. గుండెకు ఎంతో మేలు జరుగుతుందని న్యూట్రీ

మంగళవారం, 7 జూన్ 2016 (19:01 IST)
ఒత్తిడి జీవితం. దీనితో బిపి, షుగర్ సమస్యలే కాకుండా గుండె జబ్బులు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా గుండె జబ్బును నిరోధించాలంటే జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, వాల్‌నట్స్ తదితర డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికే కాదు.. గుండెకు ఎంతో మేలు జరుగుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు.
 
జీడిపప్పు ; గుండె ఆరోగ్యానికి మంచిదైన ఒలేయిక్ ఆమ్లం ఆలివ్ జీడిపప్పులో లభ్యమవుతుంది. ఇంకా రాగి, మెగ్నీషియం, జింక్, ఇనుము ఇలా శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు జీడిపప్పులో ఉన్నాయి కాబట్టి దీనిని విరివిగా తీసుకుంటూ ఉండాలి.
 
బాదం : బాదం పప్పులో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీసు, కాల్షియం, రాగి వంటి ఖనిజ లవణాలు ఇ విటమిన్ పుష్కలంగా లభిస్తాయి. రోజూ బాదం పప్పలు తింటే శరీరంలో హానికర కొవ్వునిల్వలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉండే ఫోలేట్, ఇతర బి విటమిన్లు పుట్టుకతో వచ్చే లోపాలను నిరోధిస్తాయి.
 
వాల్‌నట్స్ : ఒమెగా-3 ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అధిక రక్తపోటునూ హానికర కొలెస్ట్రాల్ స్థాయిల్ని నియంత్రిస్తుంది. వీటికుండే యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ గుణాలు ఒత్తిడి, ఆందోళన వంటివాటి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంపొందింపజేస్తాయి. కొన్నిరకాల క్యాన్సర్లను నిరోధిస్తాయి. 
 
ఎండుద్రాక్ష : వీటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. మెనోపాజ్ దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం ఎముకలపై దుష్ప్రభావం చూపి ఆస్టియోపోరోసిస్‌కి దారితీస్తుంది. అలాకాకుండా, ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షించే బోరాన్ అనే ఖనిజలవణం ఎండు ద్రాక్షలో లభ్యమవుతుందని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

పెళ్ళికి నిరాకరించిన యువతి.. కత్తితో పొడిచిన యువకుడు.. చివరకు నాటు బాంబు పేలి...

28-06-2026 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వెదర్ రిపోర్ట్- 33 జిల్లాలకు భారీ వర్ష సూచన

తిరుపతి విమానాశ్రయం మినహా బార్లు, మద్యం దుకాణాలు.. ఏపీ మార్గదర్శకాలు

ఉత్తర భారతదేశంలో కంపించిన భూమి... ఆప్ఘనిస్థాన్ ఎఫెక్ట్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

అన్నీ చూడండి

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

మలయాళ స్టార్ హీరో నివీన్ పాలీ కొత్త సినిమాకు విజయం టైటిల్ ఖరారు

అవి ఐటమ్ సాంగ్‌లు కాదు... ప్రత్యేక డ్యాన్స్ నంబర్లే : తమన్నా

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

తర్వాతి కథనం
Show comments