1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Ivy Gourd leaves paste health benefits

దొండ కాయ ఆకుల పేస్టును తింటే ఏం జరుగుతుంది?

Ivy Gourd Facts And Health Benefits
దొండ కాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద వైద్య శాస్త్రం చెపుతుంది. దొండలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. దొండ కాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము.
 
దొండ కాయలో వున్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి, వీటి వల్ల జలుబు, దగ్గు దరిచేరవు.
దొండలోని బి-విటమిన్‌ నాడీవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడేవాళ్లకి ఇది బాగా పనిచేస్తుంది.
 
రిబోఫ్లేవిన్‌ ఎక్కువగా ఉండే దొండ మనసును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్‌ తగ్గడానికి దోహదపడుతుంది. 
 
దొండ కాయలోని గుణాలు కాలేయం మీద నేరుగా పనిచేస్తాయి. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించేందుకూ దోహదపడతాయి.
 
దొండలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది. ఎముక సాంద్రత పెరిగేందుకూ తోడ్పడుతుంది. 
 
దొండ కాయ ఆకుల పేస్టును రోజుకు మాత్రల్లా వాడితే బ్యాక్టీరియాతో ఏర్పడే చర్మ సమస్యలు వుండవు.
 
దొండ కాయ పిత్త వ్యాధులను, రక్తపోటును, వాత వ్యాధులను నియంత్రిస్తుందని ఆయుర్వేదం చెపుతోంది.
 
దొండ కాయ ఆకులు లేదా ఈ ఆకుల రసాన్ని 30 గ్రాముల మోతాదులో ప్రతిరోజూ తీసుకోవడం వలన మధుమేహం పూర్తిగా తగ్గిపోతుంది.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
ఖర్జూరం పాలు తాగితే?