వేసవి కాలంలో మూడు పూటల నిమ్మరసం తాగితే...
నిమ్మరసం ఆరోగ్యానికి ఎన్నో లాభాలు చేకూర్చిపెడుతుంది. సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉండటం వల్ల మన శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి ఎక
నిమ్మరసం ఆరోగ్యానికి ఎన్నో లాభాలు చేకూర్చిపెడుతుంది. సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉండటం వల్ల మన శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఇన్‌ఫెక్షన్లు నయమవుతాయి. చర్మం, దంత సమస్యలు దూరమవుతాయి. అయితే దీన్ని రోజూ మూడు పూటలా నీటిలో కలిపి తాగితే దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా వేసవికాలంలో మూడు పూటలా నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గుతుంది. వేసవి కాలంలో ఎదురయ్యే డీ హైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం చల్లగా ఉంటుంది. జీర్ణ సంబంధ సమస్యలు నయమవుతాయి. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం తగ్గుతాయి.
శరీరంలో ఉన్న విష పదార్థాలు పోతాయి. లివర్ శుభ్రమవుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. వాంతులు, వికారం వంటి లక్షణాలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటివి తగ్గుతాయి. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు పోతాయి.
నోటి దుర్వాసన తగ్గుతుంది. చిగుళ్లు, దంత సమస్యలు మాయమవుతాయి. దంతాలు తెల్లగా, దృఢంగా మారుతాయి. దంతాలు, చిగుళ్ల నొప్పి తగ్గుతుంది. వయస్సు మీద పడడం వల్ల చర్మంపై వచ్చే ముడతలు పోతాయి. వృద్ధాప్య లక్షణాలు దరి చేరవు. చర్మం ఎల్లప్పుడూ కాంతివంతంగా ఉంటుంది. మచ్చలు, మొటిమలు పోతాయి.